Title (Indic)ఇతఁడే యతఁడు గాఁబో లేలిక బంటును నైరి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతఁడే యతఁడు గాఁబో లేలిక బంటును నైరి మితిలేని రాఘవుఁడు మేఁటి హనుమంతుఁడు (॥ఇత॥) జలధి బంధించి దాఁటె చలపట్టి రాఘవుఁడు అలరి వూరకే దాఁటె హనుమంతుఁడు అలుకతో రావణుని యద టణఁచె నతఁడు తలఁచి మైరావణుని దండించె నితఁడు (॥ఇత॥) కొండ వెల్లగించెఁ దొల్లి గోవర్ధనుఁ డతఁడు కొండతో సంజీవియెత్తెఁ గోరి యితఁడు గుండు గరఁచె నహల్యకొరకు సీతాపతి గుండు గరఁగఁగఁ బాడె కోరి యితఁడు (॥ఇత॥) అంజనా చలముమీఁద నతఁడు శ్రీ వేంకటేశుఁ డంజనీ తనయుఁ డాయ ననిలజుఁడు కంజాప్తకులరామఘనుఁడు దానును దయా - పుంజమాయ మంగాబుధి హనుమంతుడు English(||pallavi||) idam̐ḍe yadam̐ḍu gām̐bo leliga baṁṭunu nairi midileni rāghavum̐ḍu mem̐ṭi hanumaṁtum̐ḍu (||ida||) jaladhi baṁdhiṁchi dām̐ṭĕ salabaṭṭi rāghavum̐ḍu alari vūrage dām̐ṭĕ hanumaṁtum̐ḍu alugado rāvaṇuni yada ṭaṇam̐sĕ nadam̐ḍu talam̐si mairāvaṇuni daṁḍiṁchĕ nidam̐ḍu (||ida||) kŏṁḍa vĕllagiṁchĕm̐ dŏlli govardhanum̐ ḍadam̐ḍu kŏṁḍado saṁjīviyĕttĕm̐ gori yidam̐ḍu guṁḍu garam̐sĕ nahalyagŏragu sīdābadi guṁḍu garam̐gam̐gam̐ bāḍĕ kori yidam̐ḍu (||ida||) aṁjanā salamumīm̐da nadam̐ḍu śhrī veṁkaḍeśhum̐ ḍaṁjanī tanayum̐ ḍāya nanilajum̐ḍu kaṁjāptagularāmaghanum̐ḍu dānunu dayā - puṁjamāya maṁgābudhi hanumaṁtuḍu