Title (Indic)చిక్కవద్దు చొక్కవద్దు సిలుగుఁ బ్రపంచముల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చిక్కవద్దు చొక్కవద్దు సిలుగుఁ బ్రపంచముల తక్కిన భోగములెల్లా దైవమే యెరుఁగు (॥చిక్క॥) అంతరంగమునఁ దాను హరిఁ దలఁచినఁ జాలు అంతటి మీఁదటి పనులాతఁ డెరుగు పంతమున నాతనిపై భారము వేసినఁ జాలు వింత వుద్యోగములు గోవిందుఁడే యెరుఁగు (॥చిక్క॥) చేకొని యాతనిరూపు సేవించినఁ జాలు ఆకడి యీకడి కర్మా లాతఁ డెరుఁగు తేఁకువ నచ్యుతభక్తి తిరమయ్యినఁ జాలు దీకొని పరము చూప దేవుఁడే యెరుఁగు (॥చిక్క॥) సాధించి మాధవుని శరణుచొచ్చినఁ జాలు ఆదియు నంత్యములెల్లా నాతఁ డెరుఁగు పోదియై శ్రీ వేంకటేశుఁ బూజించినఁ జాలు పాదుకొని రక్షించఁ బరమాత్ముఁ డెరుఁగు English(||pallavi||) sikkavaddu sŏkkavaddu silugum̐ brabaṁchamula takkina bhogamulĕllā daivame yĕrum̐gu (||sikka||) aṁtaraṁgamunam̐ dānu harim̐ dalam̐sinam̐ jālu aṁtaḍi mīm̐daḍi panulādam̐ ḍĕrugu paṁtamuna nādanibai bhāramu vesinam̐ jālu viṁta vudyogamulu goviṁdum̐ḍe yĕrum̐gu (||sikka||) segŏni yādanirūbu seviṁchinam̐ jālu āgaḍi yīgaḍi karmā lādam̐ ḍĕrum̐gu tem̐kuva nachyudabhakti tiramayyinam̐ jālu dīgŏni paramu sūba devum̐ḍe yĕrum̐gu (||sikka||) sādhiṁchi mādhavuni śharaṇusŏchchinam̐ jālu ādiyu naṁtyamulĕllā nādam̐ ḍĕrum̐gu podiyai śhrī veṁkaḍeśhum̐ būjiṁchinam̐ jālu pādugŏni rakṣhiṁcham̐ baramātmum̐ ḍĕrum̐gu