Title (Indic)నరుఁడా యీతఁడు ఆదినారాయణుఁడు గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నరుఁడా యీతఁడు ఆదినారాయణుఁడు గాక ధరణిఁ గీరితికెక్కె దశరథసుతుఁడు (॥నరుఁ॥) యీతఁడాతాటకిఁ జంపె నీమారీచసుబాహుల- నీతఁడా మదమణఁచె నిందరుఁ జూడ యేతులకు హరువిల్లు యీతఁడా విరిచి యట్టె సీతఁ బెండ్లియాడెను యీచిన్నరాముఁడా (॥నరుఁ॥) చుప్పనాతిముక్కు గోసి సోదించి దైత్యులఁ జంపి అప్పుడిట్టె వాలి నేసినాతఁ డీతఁడా గుప్పించి కోఁతుల నేలి కొండల జలధి గట్టి కప్పి లంక సాధించె నీకౌసల్యనందఁనుడా (॥నరుఁ॥) రావణాదులనుఁ జంపి రక్షించి విభీషణుని భావిం చయోధ్య నీతఁడు పట్టమేలెను శ్రీవేంకటేశుఁ డితఁడే సృష్టి రక్షించె నితఁడే యీవల మాపాలనున్న యీరామచంద్రుఁడా English(||pallavi||) narum̐ḍā yīdam̐ḍu ādinārāyaṇum̐ḍu gāga dharaṇim̐ gīridigĕkkĕ daśharathasudum̐ḍu (||narum̐||) yīdam̐ḍādāḍagim̐ jaṁpĕ nīmārīsasubāhula- nīdam̐ḍā madamaṇam̐sĕ niṁdarum̐ jūḍa yedulagu haruvillu yīdam̐ḍā virisi yaṭṭĕ sīdam̐ bĕṁḍliyāḍĕnu yīsinnarāmum̐ḍā (||narum̐||) suppanādimukku gosi sodiṁchi daityulam̐ jaṁpi appuḍiṭṭĕ vāli nesinādam̐ ḍīdam̐ḍā guppiṁchi kom̐tula neli kŏṁḍala jaladhi gaṭṭi kappi laṁka sādhiṁchĕ nīgausalyanaṁdam̐nuḍā (||narum̐||) rāvaṇādulanum̐ jaṁpi rakṣhiṁchi vibhīṣhaṇuni bhāviṁ sayodhya nīdam̐ḍu paṭṭamelĕnu śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe sṛṣhṭi rakṣhiṁchĕ nidam̐ḍe yīvala mābālanunna yīrāmasaṁdrum̐ḍā