Title (Indic)కానవచ్చె నిందులోన కారుణ్యనరసింహా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కానవచ్చె నిందులోన కారుణ్యనరసింహా తానకమై నీకంటే దాస్యమే పో ఘనము (॥కాన॥) యెనసి ప్రహ్లాదుఁడు యెక్కడఁ జూపునోయని ననిచి లోకమెల్ల నరసింహగర్భములై పనివూని వుంటి వటు భక్తపరతంత్రుఁడవై తనిసి నీ వధికమో దాసులే యధికమో (॥కాన॥) మక్కువ బ్రహ్మాదులు మానుపరాని కోపము ఇక్కువై ప్రహ్లాదుఁడు యెదుట నిలిచితేను తక్కక మానితి వట్టే దాసుని యాధీనమై నిక్కి నీకింకరుఁడే నీకంటే బలువుఁడు (॥కాన॥) ఆరసి కమ్మర ప్రహ్లాదవరదుఁడని పేరువెట్టుకొంటి విట్టే బెరసి శ్రీవేంకటేశ సారె నీశరణాగతిజనుని కాధీనమైతి- వీరీతి నీదాసునికే యిదివో మొక్కేము English(||pallavi||) kānavachchĕ niṁdulona kāruṇyanarasiṁhā tānagamai nīgaṁṭe dāsyame po ghanamu (||kāna||) yĕnasi prahlādum̐ḍu yĕkkaḍam̐ jūbunoyani nanisi logamĕlla narasiṁhagarbhamulai panivūni vuṁṭi vaḍu bhaktabaradaṁtrum̐ḍavai tanisi nī vadhigamo dāsule yadhigamo (||kāna||) makkuva brahmādulu mānubarāni kobamu ikkuvai prahlādum̐ḍu yĕduḍa nilisidenu takkaga mānidi vaṭṭe dāsuni yādhīnamai nikki nīgiṁkarum̐ḍe nīgaṁṭe baluvum̐ḍu (||kāna||) ārasi kammara prahlādavaradum̐ḍani peruvĕṭṭugŏṁṭi viṭṭe bĕrasi śhrīveṁkaḍeśha sārĕ nīśharaṇāgadijanuni kādhīnamaidi- vīrīdi nīdāsunige yidivo mŏkkemu