Title (Indic)తానే వచ్చీ నాతఁడు తడవకురే మీరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే వచ్చీ నాతఁడు తడవకురే మీరు తానకమై నా కోరిక తగుల కేలుఁ(లుం?)దునే (॥తానే॥) వలచిన కొలఁదినే వాడికలు సమకూడు తలఁచినకొలఁదినే తమి రేఁగును పలికినకొలఁదినే పంతములు నీడేరు కలది గలంతేకాక కడమ లే లవునే (॥తానే॥) నగినకొలఁదినే నాఁటుకొనుఁ బ్రియములు సొగిసినకొలఁదినే చుట్టరికము మొగమిచ్చుకొలఁదినే మొనయు సరసములు తగులైనకూటములు తతులేల దాఁటునే (॥తానే॥) కూడినకొలఁదినే కూరిములు కొనసాగు యీడైనకొలఁదినే ఇంపులు వుట్టు వేడుకతో న న్నిట్టె శ్రీవేంకటేశుఁ డేలినాఁడు వీడని జంటలు యెట్టు విచ్చి చెప్పవచ్చునే English(||pallavi||) tāne vachchī nādam̐ḍu taḍavagure mīru tānagamai nā koriga tagula kelum̐(luṁ?)dune (||tāne||) valasina kŏlam̐dine vāḍigalu samagūḍu talam̐sinagŏlam̐dine tami rem̐gunu paliginagŏlam̐dine paṁtamulu nīḍeru kaladi galaṁtegāga kaḍama le lavune (||tāne||) naginagŏlam̐dine nām̐ṭugŏnum̐ briyamulu sŏgisinagŏlam̐dine suṭṭarigamu mŏgamichchugŏlam̐dine mŏnayu sarasamulu tagulainagūḍamulu tadulela dām̐ṭune (||tāne||) kūḍinagŏlam̐dine kūrimulu kŏnasāgu yīḍainagŏlam̐dine iṁpulu vuṭṭu veḍugado na nniṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍelinām̐ḍu vīḍani jaṁṭalu yĕṭṭu vichchi sĕppavachchune