Title (Indic)ఆతనికి నీకుఁ దగు నన్నిటా నమ్మా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనికి నీకుఁ దగు నన్నిటా నమ్మా రాతిరిఁ బగలుఁ గాఁపురము సేయవమ్మా (॥ఆత॥) గొప్పైన కన్నులదాన కోడె వయసుదాన చిప్పిలు గళలదాన సింగారిదాన యిప్పు డల్లాతఁడు మా యేలిక నిన్నుఁ జూచి కప్పుర విడె మంపెఁ గైకొనవమ్మా (॥ఆత॥) పవడపు మోవిదాన భాపు గుబ్బలదాన సవరపుఁ గొప్పుదాన చక్కనిదాన యివల నిదిగో నీ యెదుటనే వున్నవాఁడు రవళ నీ వొద్ది కిట్టె రమ్మనవమ్మా (॥ఆత॥) తళుకుఁ జెక్కులదాన తలిరుఁ బాదాలదాన సెలవి నవ్వులదాన సిగ్గరిదాన అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు మెలుపున నినుఁ గూడె మెచ్చఁగదవమ్మా English(||pallavi||) ādanigi nīgum̐ dagu nanniḍā nammā rādirim̐ bagalum̐ gām̐puramu seyavammā (||āda||) gŏppaina kannuladāna koḍĕ vayasudāna sippilu gaḽaladāna siṁgāridāna yippu ḍallādam̐ḍu mā yeliga ninnum̐ jūsi kappura viḍĕ maṁpĕm̐ gaigŏnavammā (||āda||) pavaḍabu movidāna bhābu gubbaladāna savarabum̐ gŏppudāna sakkanidāna yivala nidigo nī yĕduḍane vunnavām̐ḍu ravaḽa nī vŏddi kiṭṭĕ rammanavammā (||āda||) taḽugum̐ jĕkkuladāna talirum̐ bādāladāna sĕlavi navvuladāna siggaridāna alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu mĕlubuna ninum̐ gūḍĕ mĕchcham̐gadavammā