Title (Indic)ఆతఁ డెంత నీ వెంత అమ్మరో నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డెంత నీ వెంత అమ్మరో నీవు చేతులెత్తి మొక్కు మొక్కి సేవ సేయఁ గదవే (॥ఆతఁ॥) మెలఁగి యాతఁడు నీకు మిక్కిలి వలచునంటా కలికితనాల నెంత గయ్యాళించేవే కలకాలము నీతోనే కాఁపురము సేసెనంటా నలి రేఁగిరేఁగి యేమి నవ్వు నవ్వేవే (॥ఆతఁ॥) చెంది నీ చనువు లెల్లాఁ జెల్లించీనంటాను మందె మేళమున నెట్టు మాఁటలాడేవే సందడించి నీ యింటికి సారెకు వచ్చీనంటా గొంది నుండి యేల రాకొట్టు గొట్టేవే (॥ఆతఁ॥) యెనసి యాతఁడు నిన్ను నెగ్గు లెంచఁ డంటాను పెనఁగి యేఁటికి మోవి పిప్పి సేసేవే వినయాన నితఁడే శ్రీవేంకటేశుఁడు నిన్నేలె గొనకొని యెందాఁకాఁ గోరి కొసరేవే English(||pallavi||) ādam̐ ḍĕṁta nī vĕṁta ammaro nīvu sedulĕtti mŏkku mŏkki seva seyam̐ gadave (||ādam̐||) mĕlam̐gi yādam̐ḍu nīgu mikkili valasunaṁṭā kaligidanāla nĕṁta gayyāḽiṁcheve kalagālamu nīdone kām̐puramu sesĕnaṁṭā nali rem̐girem̐gi yemi navvu navveve (||ādam̐||) sĕṁdi nī sanuvu lĕllām̐ jĕlliṁchīnaṁṭānu maṁdĕ meḽamuna nĕṭṭu mām̐ṭalāḍeve saṁdaḍiṁchi nī yiṁṭigi sārĕgu vachchīnaṁṭā gŏṁdi nuṁḍi yela rāgŏṭṭu gŏṭṭeve (||ādam̐||) yĕnasi yādam̐ḍu ninnu nĕggu lĕṁcham̐ ḍaṁṭānu pĕnam̐gi yem̐ṭigi movi pippi seseve vinayāna nidam̐ḍe śhrīveṁkaḍeśhum̐ḍu ninnelĕ gŏnagŏni yĕṁdām̐kām̐ gori kŏsareve