Title (Indic)ఆఁటదాని నన్ను నేఁటి కారడిఁ బెట్టీఁ దాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదాని నన్ను నేఁటి కారడిఁ బెట్టీఁ దాను గాఁటముగ నెదురాడి కాదనేటి దాననా (॥ఆఁట॥) వేడుక గలిగితేను విడిదికి రానీవే యేడనైనా నాతోను యేల నవ్వీని వాడిక వలసితేను వద్దఁ గూచుండనీవే వోడక నన్నేల యింత వొరసి చూచీని (॥ఆఁట॥) తనకు నే బాఁటైతే తగఁ బెండ్లాడనీవే తనియక యెన్ని జాణతనా లాడీని పని గలిగితే నాకు బాగాలు వెట్టనీవే చెనకి మోవి సన్నలు సేసి యేమి చూపీని (॥ఆఁట॥) కరుణ నాపైఁ గలిగితే కాఁగిలించుకోనీవే విరుల వేసి నన్నెంత వేఁడుకొనీని యరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె మరిగి వుండనీవే మనసెంత రేఁచీని English(||pallavi||) ām̐ṭadāni nannu nem̐ṭi kāraḍim̐ bĕṭṭīm̐ dānu gām̐ṭamuga nĕdurāḍi kādaneḍi dānanā (||ām̐ṭa||) veḍuga galigidenu viḍidigi rānīve yeḍanainā nādonu yela navvīni vāḍiga valasidenu vaddam̐ gūsuṁḍanīve voḍaga nannela yiṁta vŏrasi sūsīni (||ām̐ṭa||) tanagu ne bām̐ṭaide tagam̐ bĕṁḍlāḍanīve taniyaga yĕnni jāṇadanā lāḍīni pani galigide nāgu bāgālu vĕṭṭanīve sĕnagi movi sannalu sesi yemi sūbīni (||ām̐ṭa||) karuṇa nābaim̐ galigide kām̐giliṁchugonīve virula vesi nannĕṁta vem̐ḍugŏnīni yaravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ marigi vuṁḍanīve manasĕṁta rem̐sīni