Title (Indic)ఆఁటది బతిమాలితే నారజకత్తె యందురు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటది బతిమాలితే నారజకత్తె యందురు యేఁటికి నన్నుఁ గొసరే విన్నిటా జాణఁడవు (॥ఆఁట॥) జలజాక్షి యొకతె నీ సంగడిఁ గూచుండఁగాను సొలయక వేరొకతెకుఁ జోట్టున్నదా కలికి యొకతె నీకుఁ గైదండ కిచ్చుకుండఁగా చలపట్టి పెనఁగితే చప్పనగాదా (॥ఆఁట॥) మగువ యొకతె నీతో మాఁటలాడుచుండఁగాను తగుల వేరొకతెకుఁ దగవయ్యీనా మృగనేత్రి నీ కొకతె మేకొని సేవసేయఁగా జిగిమించి నీతోనవ్వ సిగ్గుగాదా (॥ఆఁట॥) వనిత యొకతె నిన్ను వసము సేసుకొండఁగా చెనక వేరొకతెకుఁ జెల్లుబడౌనా యెనసితివి శ్రీవేంకటేశ నీవె నన్నింతలో నిన్ను నిఁక మెచ్చేదే నేరుపుగాదా English(||pallavi||) ām̐ṭadi badimālide nārajagattĕ yaṁduru yem̐ṭigi nannum̐ gŏsare vinniḍā jāṇam̐ḍavu (||ām̐ṭa||) jalajākṣhi yŏgadĕ nī saṁgaḍim̐ gūsuṁḍam̐gānu sŏlayaga verŏgadĕgum̐ joṭṭunnadā kaligi yŏgadĕ nīgum̐ gaidaṁḍa kichchuguṁḍam̐gā salabaṭṭi pĕnam̐gide sappanagādā (||ām̐ṭa||) maguva yŏgadĕ nīdo mām̐ṭalāḍusuṁḍam̐gānu tagula verŏgadĕgum̐ dagavayyīnā mṛganetri nī kŏgadĕ megŏni sevaseyam̐gā jigimiṁchi nīdonavva siggugādā (||ām̐ṭa||) vanida yŏgadĕ ninnu vasamu sesugŏṁḍam̐gā sĕnaga verŏgadĕgum̐ jĕllubaḍaunā yĕnasidivi śhrīveṁkaḍeśha nīvĕ nanniṁtalo ninnu nim̐ka mĕchchede nerubugādā