Title (Indic)గుట్టుతోడ నుండవే కొమ్మలెల్లా మెచ్చేరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గుట్టుతోడ నుండవే కొమ్మలెల్లా మెచ్చేరు గట్టిగాఁ దానే వచ్చి కరుణించి నీతఁడు (॥గుట్టు॥) నవ్వకునే యంతేసి నయగారి తనముల తవ్వకువే వలపులు దప్పిగొనీని రువ్వకువే మాఁటల రొక్కముగా నొక్కమాటే నివ్వటిల్ల నీకంటె నేరుపరి యీతఁడు (॥గుట్టు॥) మొక్కకువే సారె సారె ముదిరీ నీ వావులు చొక్కకువే కన్నులను సొలపుదేరి నిక్కకువే యంతేసి నేఁడె నీ సొబగులెల్లా నెక్కొని నీకంటేను నెరవాది యీతఁడు (॥గుట్టు॥) పెంచకువే పంతాలు పెనఁగి పెనఁగి నీవు వంచకువే నీ శిరసు వట్టి సిగ్గుల యెంచఁగ శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నీ వితని మించి కూడేవు నీకంటె మేటిజాణఁ డీతఁడు English(||pallavi||) guṭṭudoḍa nuṁḍave kŏmmalĕllā mĕchcheru gaṭṭigām̐ dāne vachchi karuṇiṁchi nīdam̐ḍu (||guṭṭu||) navvagune yaṁtesi nayagāri tanamula tavvaguve valabulu dappigŏnīni ruvvaguve mām̐ṭala rŏkkamugā nŏkkamāḍe nivvaḍilla nīgaṁṭĕ nerubari yīdam̐ḍu (||guṭṭu||) mŏkkaguve sārĕ sārĕ mudirī nī vāvulu sŏkkaguve kannulanu sŏlabuderi nikkaguve yaṁtesi nem̐ḍĕ nī sŏbagulĕllā nĕkkŏni nīgaṁṭenu nĕravādi yīdam̐ḍu (||guṭṭu||) pĕṁchaguve paṁtālu pĕnam̐gi pĕnam̐gi nīvu vaṁchaguve nī śhirasu vaṭṭi siggula yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu nī vidani miṁchi kūḍevu nīgaṁṭĕ meḍijāṇam̐ ḍīdam̐ḍu