Title (Indic)ఆయలేవే నీ పగటులన్నీఁ గంటిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆయలేవే నీ పగటులన్నీఁ గంటిని యీయెడ మెంతైనా నాతో నీడు వచ్చేవా (॥ఆయ॥) పుక్కిటి తములముతో పొంచి పొంచి విభునికి యెక్కడలేని కతలు నేమి చెప్పేనే చెక్కు చెమ టాతనిపైఁ జిందఁగానే యంటిముట్టి గక్కన నెంతేసి వూడిగములు సేసేవే (॥ఆయ॥) కొప్పు పువ్వులు పతిపై కులికి రాలుచుకొంటా యిప్పు డెంత చెనకులా నెలయించేవే రెప్పల చూపులఁ జెలరేఁగి కోమలపు మోము కప్పుకొని యెందాఁకా నేఁకరి చూచేవే (॥ఆయ॥) గట్టి చన్నులు శ్రీవేంకటేశ్వరు దాఁకఁగాను యిట్టునట్టు జవ్వాది యేమి పూసేవే నెట్టవ నన్నితఁడేలె నే నలమేలుమంగను చుట్టరికముల నీవు సుద్దు లేమి చెప్పేనే English(||pallavi||) āyaleve nī pagaḍulannīm̐ gaṁṭini yīyĕḍa mĕṁtainā nādo nīḍu vachchevā (||āya||) pukkiḍi tamulamudo pŏṁchi pŏṁchi vibhunigi yĕkkaḍaleni kadalu nemi sĕppene sĕkku sĕma ṭādanibaim̐ jiṁdam̐gāne yaṁṭimuṭṭi gakkana nĕṁtesi vūḍigamulu seseve (||āya||) kŏppu puvvulu padibai kuligi rālusugŏṁṭā yippu ḍĕṁta sĕnagulā nĕlayiṁcheve rĕppala sūbulam̐ jĕlarem̐gi komalabu momu kappugŏni yĕṁdām̐kā nem̐kari sūseve (||āya||) gaṭṭi sannulu śhrīveṁkaḍeśhvaru dām̐kam̐gānu yiṭṭunaṭṭu javvādi yemi pūseve nĕṭṭava nannidam̐ḍelĕ ne nalamelumaṁganu suṭṭarigamula nīvu suddu lemi sĕppene