Title (Indic)వింటిరటె యీ సుద్దులు వెలఁదులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వింటిరటె యీ సుద్దులు వెలఁదులాల జంటగా రాముఁడు ముందె జనియించినాఁడట (॥వింటి॥) పొంచి కంసుని వధించి భూ భార బడఁచఁగ అంచెలఁ గృష్ణదేవుఁడు అవతారమందె నిదె మంచివేళ శ్రావణమాస బహుళాష్టమిని యెంచఁగ నడురేఇ రోహిణి నక్షత్రమున (॥వింటి॥) పాండవుల రక్షింప బలుకౌరవులఁ జంప అండవే వసుదేవునియందు జనియించె నిదె దండి మధురలోపలఁ దగ రేపల్లె లోపల గండుమీరి పెరిగీని గారాబమునను (॥వింటి॥) దానవుల నడపగ ధర్మములు నిలుపఁగ పూని దేవకీదేవి పుత్రుఁడై పొడమె నిదె ఆనుక శ్రీవేంకటాద్రి నలమేల్మంగయుఁ దాను నానాజీవులఁ గాచి యున్నతి మించినారు English(||pallavi||) viṁṭiraḍĕ yī suddulu vĕlam̐dulāla jaṁṭagā rāmum̐ḍu muṁdĕ janiyiṁchinām̐ḍaḍa (||viṁṭi||) pŏṁchi kaṁsuni vadhiṁchi bhū bhāra baḍam̐sam̐ga aṁchĕlam̐ gṛṣhṇadevum̐ḍu avadāramaṁdĕ nidĕ maṁchiveḽa śhrāvaṇamāsa bahuḽāṣhṭamini yĕṁcham̐ga naḍurei rohiṇi nakṣhatramuna (||viṁṭi||) pāṁḍavula rakṣhiṁpa balugauravulam̐ jaṁpa aṁḍave vasudevuniyaṁdu janiyiṁchĕ nidĕ daṁḍi madhuralobalam̐ daga reballĕ lobala gaṁḍumīri pĕrigīni gārābamunanu (||viṁṭi||) dānavula naḍabaga dharmamulu nilubam̐ga pūni devagīdevi putrum̐ḍai pŏḍamĕ nidĕ ānuga śhrīveṁkaḍādri nalamelmaṁgayum̐ dānu nānājīvulam̐ gāsi yunnadi miṁchināru