Title (Indic)ఎటువంటి సన్నలో ఇంతికి నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎటువంటి సన్నలో ఇంతికి నీకు తటుకన మీ పొందులు దాఁచనేఁటికయ్యా (॥ఎటు॥) తారుకాణగా నాపె తనమోము నీకుఁ జూపె కూరిమితో నిందాఁకా నీ కొలువు సేసె సారె సారెఁ గుంచె వేసి చన్నులనిన్నునొరసె ఆరీతినే చనవిచ్చి యాదరించవయ్యా (॥ఎటు॥) మనసు గరఁగ నీతో మాఁటలన్నయు నాడె వినయముతో నీకు వీడెమిచ్చెను పెనఁగుతా నీచెక్కులు పెదవులు దాఁకించె యెనసి యాపె కోరిక లీడెరించవయ్యా (॥ఎటు॥) పూసిక కమ్మఁబూఁత బగులుకోఁ గాఁగిలించె సేసవెట్టి పెండ్లాడెఁ జేతులారాను ఆసయిచ్చి నన్నేలితి వప్పటి శ్రీ వేంకటేశ రాసికెక్క నీపె నిట్టె రతిఁగూడవయ్యా English(||pallavi||) ĕḍuvaṁṭi sannalo iṁtigi nīgu taḍugana mī pŏṁdulu dām̐sanem̐ṭigayyā (||ĕḍu||) tārugāṇagā nābĕ tanamomu nīgum̐ jūbĕ kūrimido niṁdām̐kā nī kŏluvu sesĕ sārĕ sārĕm̐ guṁchĕ vesi sannulaninnunŏrasĕ ārīdine sanavichchi yādariṁchavayyā (||ĕḍu||) manasu garam̐ga nīdo mām̐ṭalannayu nāḍĕ vinayamudo nīgu vīḍĕmichchĕnu pĕnam̐gudā nīsĕkkulu pĕdavulu dām̐kiṁchĕ yĕnasi yābĕ koriga līḍĕriṁchavayyā (||ĕḍu||) pūsiga kammam̐būm̐ta bagulugom̐ gām̐giliṁchĕ sesavĕṭṭi pĕṁḍlāḍĕm̐ jedulārānu āsayichchi nannelidi vappaḍi śhrī veṁkaḍeśha rāsigĕkka nībĕ niṭṭĕ radim̐gūḍavayyā