Title (Indic)ఆతఁ డెంత నీవెంత అంతరము లెంచుకోము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డెంత నీవెంత అంతరము లెంచుకోము చేతికి దొరకనంటా సేవలు సేసేవు (॥ఆతం॥) చెలరేఁగి చెలరేఁగి సేసేవు విన్నపాలు వెలయ నాతఁడు సారె వినీ నంటాను మెలఁగే వెదుల మందె మేళమున నప్పటిని నలుగడ నీతో నిట్టె నవ్వీనంటాను (॥ఆతం॥) తగిలి తగిలి యాతనిమోము చూచేవు నిగిడి నీముందరను నిలిచెనంటా జిగిమించఁ గొనగోరఁ జెనకఁగ వచ్చేవు వొగి మొగమాటమున నున్నాఁ డంటాను (॥ఆతం॥) నానఁబెట్టి నానఁటబెట్టి సయగారాలు చూపేవు కానిమ్మని నీచేఁతలఁ గైకొనీనంటా యే నలమేల్మంగను నన్నేలె శ్రీవేంకటేశుఁడు నీ నేరుపులు చెప్పేవు నిన్ను నిచ్చీనంటాను English(||pallavi||) ādam̐ ḍĕṁta nīvĕṁta aṁtaramu lĕṁchugomu sedigi dŏraganaṁṭā sevalu sesevu (||ādaṁ||) sĕlarem̐gi sĕlarem̐gi sesevu vinnabālu vĕlaya nādam̐ḍu sārĕ vinī naṁṭānu mĕlam̐ge vĕdula maṁdĕ meḽamuna nappaḍini nalugaḍa nīdo niṭṭĕ navvīnaṁṭānu (||ādaṁ||) tagili tagili yādanimomu sūsevu nigiḍi nīmuṁdaranu nilisĕnaṁṭā jigimiṁcham̐ gŏnagoram̐ jĕnagam̐ga vachchevu vŏgi mŏgamāḍamuna nunnām̐ ḍaṁṭānu (||ādaṁ||) nānam̐bĕṭṭi nānam̐ṭabĕṭṭi sayagārālu sūbevu kānimmani nīsem̐talam̐ gaigŏnīnaṁṭā ye nalamelmaṁganu nannelĕ śhrīveṁkaḍeśhum̐ḍu nī nerubulu sĕppevu ninnu nichchīnaṁṭānu