Title (Indic)అటువంటి విద్యలు నీ యందు వున్నవి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అటువంటి విద్యలు నీ యందు వున్నవి నటన లెందూ నొల్లవు నాకే దక్కితివి (॥అటు॥) ముంచి యవ్వతెకైనాను మోహించిన మగవాఁడు కొంచించు మాఁటలాడ కోమలులతో వంచించక నమ్మికలు వడి నొసఁగినవాఁడు అంచెల వట్టియాచారాలన్నియు నెరపును (॥అటు॥) ననిచి యెవ్వతెకైనా నమ్మిక లిచ్చినవాఁడు యెనసి నవ్వఁ జాలఁడు యింతులతోడు మనసిచ్చి యొక్కతెనే మరిగియుండినవాఁడు చెనకిన లోనుగాక చెల్లించు నేమములు (॥అటు॥) వాడికె నెవ్వతెకైనా వసమై యుండినవాఁడు చూడనోడు నూరకైనా సుదతులను యీడ నిట్టె శ్రీవేంకటేశ నన్ను నేలితివి యేడా నీవంటివాఁడు లేఁ డిచ్చక మిట్టుండును English(||pallavi||) aḍuvaṁṭi vidyalu nī yaṁdu vunnavi naḍana lĕṁdū nŏllavu nāge dakkidivi (||aḍu||) muṁchi yavvadĕgainānu mohiṁchina magavām̐ḍu kŏṁchiṁchu mām̐ṭalāḍa komalulado vaṁchiṁchaga nammigalu vaḍi nŏsam̐ginavām̐ḍu aṁchĕla vaṭṭiyāsārālanniyu nĕrabunu (||aḍu||) nanisi yĕvvadĕgainā nammiga lichchinavām̐ḍu yĕnasi navvam̐ jālam̐ḍu yiṁtuladoḍu manasichchi yŏkkadĕne marigiyuṁḍinavām̐ḍu sĕnagina lonugāga sĕlliṁchu nemamulu (||aḍu||) vāḍigĕ nĕvvadĕgainā vasamai yuṁḍinavām̐ḍu sūḍanoḍu nūragainā sudadulanu yīḍa niṭṭĕ śhrīveṁkaḍeśha nannu nelidivi yeḍā nīvaṁṭivām̐ḍu lem̐ ḍichchaga miṭṭuṁḍunu