Title (Indic)ఎఱఁగమా మీ రాజస మింతక తొల్లి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎఱఁగమా మీ రాజస మింతక తొల్లి మఱఁగులు మాని నాతో మాఁటలాడరాదా (॥ఎఱఁ॥) మొగము చూచి నేఁడు మొక్కించుకో నెంత లేదు నగ వెంత లేదు నీకు నలినాక్షితో తగ నీకు నాపెకును దగ్గరి వచ్చిన యట్టి మగువను నాతో గొంత మాఁటలాడరాదా (॥ఎఱఁ॥) వేడుక నాపెచేఁతకు వెరగంద వెంత లేదు యీడు జోడుగాఁ బెనఁగ నెంత లేదు కూడితిరి మీరిద్దరు గురియై నే నింతలో మాడలు రాలఁగ నాతో మాఁటలాడరాదా (॥ఎఱఁ॥) చంచుల సన్నలు సేసి చనవియ్య నెంత లేదు ఇంచు కించుకే కొసర నెంత లేదు కొంచక శ్రీ వేంకటేశ కోరి నన్ను నేలితివి మంచము పైనే నాతో మాఁటలాడరాదా English(||pallavi||) ĕṟam̐gamā mī rājasa miṁtaga tŏlli maṟam̐gulu māni nādo mām̐ṭalāḍarādā (||ĕṟam̐||) mŏgamu sūsi nem̐ḍu mŏkkiṁchugo nĕṁta ledu naga vĕṁta ledu nīgu nalinākṣhido taga nīgu nābĕgunu daggari vachchina yaṭṭi maguvanu nādo gŏṁta mām̐ṭalāḍarādā (||ĕṟam̐||) veḍuga nābĕsem̐tagu vĕragaṁda vĕṁta ledu yīḍu joḍugām̐ bĕnam̐ga nĕṁta ledu kūḍidiri mīriddaru guriyai ne niṁtalo māḍalu rālam̐ga nādo mām̐ṭalāḍarādā (||ĕṟam̐||) saṁchula sannalu sesi sanaviyya nĕṁta ledu iṁchu kiṁchuge kŏsara nĕṁta ledu kŏṁchaga śhrī veṁkaḍeśha kori nannu nelidivi maṁchamu paine nādo mām̐ṭalāḍarādā