Title (Indic)ఆతని మహిమో నాది అంత మెత్తని మనసో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని మహిమో నాది అంత మెత్తని మనసో యేతులు నెమ్మెలు మీతో నేమి చెప్పేనే (॥ఆత॥) కోపగించి చూడఁబోయి గొబ్బుననుఁ గరఁగితి చేపట్లకు దగ్గరి చేరి మొక్కితి రాపులఁ బెనఁగఁ బోయి రతికేళికిఁ దీసితి యేపున నాపంత మిఁక యేమి చెప్పేనే (॥ఆత॥) జంకించఁ బోయి నా చనుకట్లు వదలితి వంకలొత్తఁ బోయి వానివలఁ జిక్కితి బింకములాడఁబోయి ప్రియములెల్లాఁ జెప్పితి యింకా నా సుద్దులు నే నేమి చెప్పేనే (॥ఆత॥) చలము సాదించఁబోయి సరసములాడితి బలువు చూపఁగఁబోయి పట్టి కూడితి యెలమి శ్రీ వేంకటేశుఁడెనసె నాతో నింత యెలుగెత్తి నాగుణాలు యేమి చెప్పేనే English(||pallavi||) ādani mahimo nādi aṁta mĕttani manaso yedulu nĕmmĕlu mīdo nemi sĕppene (||āda||) kobagiṁchi sūḍam̐boyi gŏbbunanum̐ garam̐gidi sebaṭlagu daggari seri mŏkkidi rābulam̐ bĕnam̐gam̐ boyi radigeḽigim̐ dīsidi yebuna nābaṁta mim̐ka yemi sĕppene (||āda||) jaṁkiṁcham̐ boyi nā sanugaṭlu vadalidi vaṁkalŏttam̐ boyi vānivalam̐ jikkidi biṁkamulāḍam̐boyi priyamulĕllām̐ jĕppidi yiṁkā nā suddulu ne nemi sĕppene (||āda||) salamu sādiṁcham̐boyi sarasamulāḍidi baluvu sūbam̐gam̐boyi paṭṭi kūḍidi yĕlami śhrī veṁkaḍeśhum̐ḍĕnasĕ nādo niṁta yĕlugĕtti nāguṇālu yemi sĕppene