Title (Indic)ఆడనుండి వచ్చి నాకు ఆసపడేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడనుండి వచ్చి నాకు ఆసపడేవు జోడుకూడి నిన్ను రతిఁ జొక్కించదాయనా (॥ఆడ॥) పైపై నన్నుఁ జెనకేవు పాఁచి మేనితో వచ్చి ఆపె వోపనప్పుడెల్లా నడ్డమా నేను కోపము గాదుగా గొబ్బన నిన్నడిగితి ఆ పాటి నిన్నుఁ దనివి నందించదాయనా (॥ఆడ॥) పట్టి విడె మడిగేవు పరఁగడుపునవచ్చి వొట్టి యాపె వూడిగాల కూరటా నేను దిట్టతనమున నిన్నుఁ దెలియవలసి యింతె బెట్టుగఁ దమ్ములమైనాఁ బెట్టదాయనా (॥ఆడ॥) వంచి నామోము చూచేవు వరవాత లేచివచ్చి అంచెనాచేఁతను చూడ నడ్డమా నేను కొంచక శ్రీ వేంకటేశ కూడితివి నన్ను నీకు మంచి మొగాలవారి నెమ్మదిఁ జూపదాయనా English(||pallavi||) āḍanuṁḍi vachchi nāgu āsabaḍevu joḍugūḍi ninnu radim̐ jŏkkiṁchadāyanā (||āḍa||) paibai nannum̐ jĕnagevu pām̐si menido vachchi ābĕ vobanappuḍĕllā naḍḍamā nenu kobamu gādugā gŏbbana ninnaḍigidi ā pāḍi ninnum̐ danivi naṁdiṁchadāyanā (||āḍa||) paṭṭi viḍĕ maḍigevu param̐gaḍubunavachchi vŏṭṭi yābĕ vūḍigāla kūraḍā nenu diṭṭadanamuna ninnum̐ dĕliyavalasi yiṁtĕ bĕṭṭugam̐ dammulamainām̐ bĕṭṭadāyanā (||āḍa||) vaṁchi nāmomu sūsevu varavāda lesivachchi aṁchĕnāsem̐tanu sūḍa naḍḍamā nenu kŏṁchaga śhrī veṁkaḍeśha kūḍidivi nannu nīgu maṁchi mŏgālavāri nĕmmadim̐ jūbadāyanā