Title (Indic)ఆపె గలిగుండఁగాను అనుమానాలిఁక నేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆపె గలిగుండఁగాను అనుమానాలిఁక నేల కోపగించేమా నేము కొంకనేల నీకును (॥ఆపె॥) పూసగుచ్చినట్టు నీకు బుద్దులు చెప్పీ నాకె వేసరక వినవయ్య వేమారును ఆసలాసలఁ దిరిగే మంతనింత నీవెంట వీసమంత మమ్ముఁ జూచి వెఱపేల నీకును (॥ఆపె॥) తెమలించి నీగుణాలు తిద్దుకవచ్చీ నాపె అమర నడవవయ్య ఔఁ గాదనక తమకించి నీ యింట తావై వుండేము నేము విమలపు మమ్ముఁ జూచి వెఱపేల నీకును (॥ఆపె॥) నెయ్యమున నిన్నుఁగూడి నేరుపరిఁ జేసీ నాపె ఇయ్యకోలు గొనవయ్య ఇందరిలోన చయ్యనఁ గూడితిమి ఇచ్చటనే శ్రీ వేంకటేశ వెయ్యయినా మమ్ముఁ జూచి వెఱపేల నీకును English(||pallavi||) ābĕ galiguṁḍam̐gānu anumānālim̐ka nela kobagiṁchemā nemu kŏṁkanela nīgunu (||ābĕ||) pūsaguchchinaṭṭu nīgu buddulu sĕppī nāgĕ vesaraga vinavayya vemārunu āsalāsalam̐ dirige maṁtaniṁta nīvĕṁṭa vīsamaṁta mammum̐ jūsi vĕṟabela nīgunu (||ābĕ||) tĕmaliṁchi nīguṇālu tiddugavachchī nābĕ amara naḍavavayya aum̐ gādanaga tamagiṁchi nī yiṁṭa tāvai vuṁḍemu nemu vimalabu mammum̐ jūsi vĕṟabela nīgunu (||ābĕ||) nĕyyamuna ninnum̐gūḍi nerubarim̐ jesī nābĕ iyyagolu gŏnavayya iṁdarilona sayyanam̐ gūḍidimi ichchaḍane śhrī veṁkaḍeśha vĕyyayinā mammum̐ jūsi vĕṟabela nīgunu