Title (Indic)ఆఁటది చేసిన మేలు అది విచారించవైతి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటది చేసిన మేలు అది విచారించవైతి గాఁటానఁ బెనఁగుదురా కాతరానను (॥ఆట॥) సింగారించుకొని యిట్టె చెలి నీ యండకు రాఁగా ముంగురులంటుదురా మొక్కలానను సంగతిగా మోవి చూపి చవులు వుట్టించఁగాను కొంగువట్టి తీతురా గొరబుగాను (॥ఆట॥) పుక్కిటివిడెముతోడ పొలితి నీతో నవ్వఁగా పక్కనఁ బిసుకుదురా పాలిండ్లు అక్కరతో నీకు విడె మందియ్యరాఁగాను తక్కక గిలిగింతురా తత్తరానను (॥ఆట॥) కడు మోహమున నిన్నుఁ గాఁగిలించుకొనఁగాను బడల నలయింతురా పచ్చదేరను అడరి శ్రీవేంకటేశ అంగన నిన్నుఁ గూడఁగా తడవి వేగిరింతురా దప్పిదేరను English(||pallavi||) ām̐ṭadi sesina melu adi visāriṁchavaidi gām̐ṭānam̐ bĕnam̐gudurā kādarānanu (||āḍa||) siṁgāriṁchugŏni yiṭṭĕ sĕli nī yaṁḍagu rām̐gā muṁgurulaṁṭudurā mŏkkalānanu saṁgadigā movi sūbi savulu vuṭṭiṁcham̐gānu kŏṁguvaṭṭi tīdurā gŏrabugānu (||āḍa||) pukkiḍiviḍĕmudoḍa pŏlidi nīdo navvam̐gā pakkanam̐ bisugudurā pāliṁḍlu akkarado nīgu viḍĕ maṁdiyyarām̐gānu takkaga giligiṁturā tattarānanu (||āḍa||) kaḍu mohamuna ninnum̐ gām̐giliṁchugŏnam̐gānu baḍala nalayiṁturā pachchaderanu aḍari śhrīveṁkaḍeśha aṁgana ninnum̐ gūḍam̐gā taḍavi vegiriṁturā dappideranu