Title (Indic)ఆతఁడే మన్నించీఁగాక అందుకేమె చెలులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడే మన్నించీఁగాక అందుకేమె చెలులాల కాతరించి పైకొంటే కడు వేసటగాదా (॥ఆతఁ॥) వేడుకతో నుంటేనే విన్నవించవచ్చుఁగాక యేడో పరాకైవుటే నెందుకెక్కును కూడేబత్తి గలిగితే కొసరఁగఁ జెల్లుఁగాక వీడు జోడై వుండఁగాను వెక్కసమైతోఁచదా (॥ఆతఁ॥) మచ్చికై తా నుండితేనే మాటలాడవచ్చుఁగాక ఇచ్చగించకుండఁగాను ఇంత యేఁటికి పచ్చిదేర నవ్వితేనే పట్టిపెనఁగుటగాక యెచ్చుకుందు లాడఁగాను యెరవులే కావా (॥ఆతఁ॥) తలఁపు గలిగితేనే తమకించవచ్చుగాక చలముతో నుండఁగాను చవి యేడదే యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁగూడె అలమేలుమంగ నేను ఆస గడు మీరదా English(||pallavi||) ādam̐ḍe manniṁchīm̐gāga aṁdugemĕ sĕlulāla kādariṁchi paigŏṁṭe kaḍu vesaḍagādā (||ādam̐||) veḍugado nuṁṭene vinnaviṁchavachchum̐gāga yeḍo parāgaivuḍe nĕṁdugĕkkunu kūḍebatti galigide kŏsaram̐gam̐ jĕllum̐gāga vīḍu joḍai vuṁḍam̐gānu vĕkkasamaidom̐sadā (||ādam̐||) machchigai tā nuṁḍidene māḍalāḍavachchum̐gāga ichchagiṁchaguṁḍam̐gānu iṁta yem̐ṭigi pachchidera navvidene paṭṭibĕnam̐guḍagāga yĕchchuguṁdu lāḍam̐gānu yĕravule kāvā (||ādam̐||) talam̐pu galigidene tamagiṁchavachchugāga salamudo nuṁḍam̐gānu savi yeḍade yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐gūḍĕ alamelumaṁga nenu āsa gaḍu mīradā