Title (Indic)మాకేలయ్యా ఇంత నీతో మారుకొనను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకేలయ్యా ఇంత నీతో మారుకొనను చేకొని ఇట్టె అందాలు సేసుకొంట గాక (॥మాకే॥) చెక్కులపై చెమటలు చిగిరింపుఁ బలకలు యెక్కడి వనెడిగితే నేమందువొ ముక్కున నిట్టూరుపులు ముంచిన మోముకళలు నెక్కొనె నీకనియంటే నీచిత్త మెట్టుండునో (॥మాకే॥) కనుఁగొనల నిద్రలు కాయముపై యలపులు ఘనమాయనంటే నెంత కాఁతాళింతువో వెనుకొన్న సన్నలును వేవేలు తమకములు పెనగొనీనంటే యెంత బీరములాడుదువో (॥మాకే॥) పెదవిపై వసివాడు పిక్కటిలుఁ బరాకులు యిదివోయని చూపితే నెంత మెత్తువో అదన శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి కదిసి గరిసించితే కైవస మెట్టౌదువో English(||pallavi||) māgelayyā iṁta nīdo mārugŏnanu segŏni iṭṭĕ aṁdālu sesugŏṁṭa gāga (||māge||) sĕkkulabai sĕmaḍalu sigiriṁpum̐ balagalu yĕkkaḍi vanĕḍigide nemaṁduvŏ mukkuna niṭṭūrubulu muṁchina momugaḽalu nĕkkŏnĕ nīganiyaṁṭe nīsitta mĕṭṭuṁḍuno (||māge||) kanum̐gŏnala nidralu kāyamubai yalabulu ghanamāyanaṁṭe nĕṁta kām̐tāḽiṁtuvo vĕnugŏnna sannalunu vevelu tamagamulu pĕnagŏnīnaṁṭe yĕṁta bīramulāḍuduvo (||māge||) pĕdavibai vasivāḍu pikkaḍilum̐ barāgulu yidivoyani sūbide nĕṁta mĕttuvo adana śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi kadisi garisiṁchide kaivasa mĕṭṭauduvo