Title (Indic)బాపు బాపు మెచ్చితినే పడఁతి నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు మెచ్చితినే పడఁతి నిన్ను రేపు మాపు నితనినే మరిగించుకొంటివి (॥బాపు॥) సేయరానివినయాలు సేసిసేని రమణుని చాయకుఁ దెచ్చుకొంటివి జాణవౌదువే పాయకుండాఁ జెప్పరానిబాస సేఇంచుకొంటివి నీయంతటి దెవ్వతె నెలఁతలలోనను (॥బాపు॥) కడలేనికతలును కారణాలుఁ జెప్పి పతి - నొడఁబరు కొంటివి వొద్దికాయనే జడియక సేవసేసి చన విప్పించుకొంటివి కడు నీగుణములు పొగడ నెట్టు వచ్చునే (॥బాపు॥) పలుమారు మోవితేనెపదనులు చూపి చూపి వెలయఁ గూడితివి శ్రీవేంకటేశ్వరు యెలమితో నన్ను నేలె యీతఁడే అప్పటి నేఁడు బలిమి నీతో నెట్టు పచరించవచ్చునే English(||pallavi||) bābu bābu mĕchchidine paḍam̐ti ninnu rebu mābu nidanine marigiṁchugŏṁṭivi (||bābu||) seyarānivinayālu sesiseni ramaṇuni sāyagum̐ dĕchchugŏṁṭivi jāṇavauduve pāyaguṁḍām̐ jĕpparānibāsa seiṁchugŏṁṭivi nīyaṁtaḍi dĕvvadĕ nĕlam̐talalonanu (||bābu||) kaḍalenigadalunu kāraṇālum̐ jĕppi padi - nŏḍam̐baru kŏṁṭivi vŏddigāyane jaḍiyaga sevasesi sana vippiṁchugŏṁṭivi kaḍu nīguṇamulu pŏgaḍa nĕṭṭu vachchune (||bābu||) palumāru movidenĕbadanulu sūbi sūbi vĕlayam̐ gūḍidivi śhrīveṁkaḍeśhvaru yĕlamido nannu nelĕ yīdam̐ḍe appaḍi nem̐ḍu balimi nīdo nĕṭṭu pasariṁchavachchune