Title (Indic)ఇతవైనప్పుడే పతి యీడకు వచ్చీఁగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇతవైనప్పుడే పతి యీడకు వచ్చీఁగాని చతురుని నిందుకుఁ గా జంకించ నోపనే (॥ఇత॥) చనపుగల్గుమాట చక్కనై యిన్నిటాఁ జెలులు మనసెసనిన పొందు మఱపుఁ గాదు ననుపులేనిచోట నగవులకైనాను పెనఁగితేఁ జలమెక్కు పిలువ నేనోపనే (॥ఇత॥) ముసిపి దీరనిచోట మోనమైనా నింపులే సుసరమయిన చోటి సుద్దులే చని కసిగాటు మోహముతో కలగంప వలపులు పిసికితేఁ బుసురౌను పిలువ నే నోపనే (॥ఇత॥) చేరి సరసపు వేళఁ జేసినదెల్లాఁ జేఁత యీరీతి శ్రీవేంకటేశుఁ డిటు గూడెను వూరకే యిట్లఁ గాక వొకరీతి నైతేను పేరుకొని సారెసారెఁ బిలువ నేనోవనే English(||pallavi||) idavainappuḍe padi yīḍagu vachchīm̐gāni saduruni niṁdugum̐ gā jaṁkiṁcha nobane (||ida||) sanabugalgumāḍa sakkanai yinniḍām̐ jĕlulu manasĕsanina pŏṁdu maṟabum̐ gādu nanubulenisoḍa nagavulagainānu pĕnam̐gidem̐ jalamĕkku piluva nenobane (||ida||) musibi dīranisoḍa monamainā niṁpule susaramayina soḍi suddule sani kasigāḍu mohamudo kalagaṁpa valabulu pisigidem̐ busuraunu piluva ne nobane (||ida||) seri sarasabu veḽam̐ jesinadĕllām̐ jem̐ta yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiḍu gūḍĕnu vūrage yiṭlam̐ gāga vŏgarīdi naidenu perugŏni sārĕsārĕm̐ biluva nenovane