Title (Indic)అప్పఁజెల్లెండ్ల మింతే ఆతఁడు నవ్వీ నంతనె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) అప్పఁజెల్లెండ్ల మింతే ఆతఁడు నవ్వీ నంతనె ఇప్పుడు వేరుగఁ జూచే విది యేమే నీవు (॥అప్పఁ॥) వోరగండ్లఁ జూచేది వొక్కొక్కమా టాడేది యీరసాలువలెఁ దోఁచి నిదేమే నీవు కేరి కేరి నవ్వేది కేరడము లాడేది నేరుచుకొంటివి నాతో నీకేలే వొరిట (॥అప్పఁ॥) బొమ్మలు ముడవెట్టేది పొరపొచ్చము సేసేది యెమ్మెల రేసులు దోఁచీ నిదేమే నీవు దిమ్ములఁ జెమరించేది తీగెసాగె నూఁకొనేది కమ్మరఁ గమ్మర నీకు గలిగెఁగా నేఁడు (॥అప్పఁ॥) ముక్కున నుసురనేది మొగము వంచుకొనేది ఇక్కువసేఁతలు దోఁచీ నిదేమే నీవు తెక్కుల శ్రీ వేంకటాద్రిదేవుఁ డిట్టె నన్నుఁ గూడె వొక్కమనసున నింక నుండవే నీవు English(||pallavi||) appam̐jĕllĕṁḍla miṁte ādam̐ḍu navvī naṁtanĕ ippuḍu verugam̐ jūse vidi yeme nīvu (||appam̐||) voragaṁḍlam̐ jūsedi vŏkkŏkkamā ṭāḍedi yīrasāluvalĕm̐ dom̐si nideme nīvu keri keri navvedi keraḍamu lāḍedi nerusugŏṁṭivi nādo nīgele vŏriḍa (||appam̐||) bŏmmalu muḍavĕṭṭedi pŏrabŏchchamu sesedi yĕmmĕla resulu dom̐sī nideme nīvu dimmulam̐ jĕmariṁchedi tīgĕsāgĕ nūm̐kŏnedi kammaram̐ gammara nīgu galigĕm̐gā nem̐ḍu (||appam̐||) mukkuna nusuranedi mŏgamu vaṁchugŏnedi ikkuvasem̐talu dom̐sī nideme nīvu tĕkkula śhrī veṁkaḍādridevum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ vŏkkamanasuna niṁka nuṁḍave nīvu