Title (Indic)దొడ్డవానిఁ బంతము తొడిఁబడఁ గొనరాదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) దొడ్డవానిఁ బంతము తొడిఁబడఁ గొనరాదు వెడ్డువెట్టుటే నేర్పు వేడుకతో నిన్నును (॥దొడ్డ॥) చక్కఁగా నీతో నేను చలము సాదించరాదు ఇక్కడ నీతోఁ బొందు లెట్టు గూడీని తొక్కేవు నాపాదము తొలఁగుమనఁగరాదు మొక్కకు నే దీవించితి మొలనే నిన్నును (॥దొడ్డ॥) వాసులకు నీతోను వాదులడువఁగరాదు సేసవెట్టి నీపై నెట్టు చేయి చాఁచేము ఆసపడేవు నాకు అవుఁగాదనఁరాదు బాసలు సేయకు నమ్మి భావించితి నిన్నును (॥దొడ్డ॥) మిగుల నీతో మందెమేళము సేయఁగరాదు నగుతా నిన్నెట్లా నానలు వెట్టేది అగపడి శ్రీవేంకటాధిపతి నన్నేలితివి పొగడే వప్పటి నన్ను; పోదిసేసే నిన్నును English(||pallavi||) dŏḍḍavānim̐ baṁtamu tŏḍim̐baḍam̐ gŏnarādu vĕḍḍuvĕṭṭuḍe nerbu veḍugado ninnunu (||dŏḍḍa||) sakkam̐gā nīdo nenu salamu sādiṁcharādu ikkaḍa nīdom̐ bŏṁdu lĕṭṭu gūḍīni tŏkkevu nābādamu tŏlam̐gumanam̐garādu mŏkkagu ne dīviṁchidi mŏlane ninnunu (||dŏḍḍa||) vāsulagu nīdonu vādulaḍuvam̐garādu sesavĕṭṭi nībai nĕṭṭu seyi sām̐semu āsabaḍevu nāgu avum̐gādanam̐rādu bāsalu seyagu nammi bhāviṁchidi ninnunu (||dŏḍḍa||) migula nīdo maṁdĕmeḽamu seyam̐garādu nagudā ninnĕṭlā nānalu vĕṭṭedi agabaḍi śhrīveṁkaḍādhibadi nannelidivi pŏgaḍe vappaḍi nannu; podisese ninnunu