Title (Indic)ఎంత వేగిరకాఁడవు యింతుల యడాటాన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఎంత వేగిరకాఁడవు యింతుల యడాటాన వింతవింత చేఁతలను వీరిడిఁ జేసేవు (॥ఎంత॥) మేరమీరి యాపె నీతో మేలములాడెనంటా తేరకొనఁజూచి కొప్పు జారఁదీసేవు గోర గీరి యట్టె నిన్ను కోపగించి అట్టెనంటా సారెసారెఁ గొంగువట్టి సాదించేవు (॥ఎంత॥) బింకముగా నాపె నీతో బెట్టుగాఁ బెనఁగెనంటా పొంకాన పూవుబంతిని పూఁచి వేసేవు అంకెల నంతలో నిన్ను అద్దలించి చూచెనంటా సంకెలేక వుద్దండాన చదురులాడేవు (॥ఎంత॥) గయ్యాళితనాన నాపె కాఁగిలించుకొనెనంటా వుయ్యాలమంచముమీఁది కొగిఁదేసేవు నెయ్యపు శ్రీవేంకటేశ నిన్నిట్టె చొక్కించెనంటా తియ్యనిమోవి యిచ్చి దీకొనేవు English(||pallavi||) ĕṁta vegiragām̐ḍavu yiṁtula yaḍāḍāna viṁtaviṁta sem̐talanu vīriḍim̐ jesevu (||ĕṁta||) meramīri yābĕ nīdo melamulāḍĕnaṁṭā teragŏnam̐jūsi kŏppu jāram̐dīsevu gora gīri yaṭṭĕ ninnu kobagiṁchi aṭṭĕnaṁṭā sārĕsārĕm̐ gŏṁguvaṭṭi sādiṁchevu (||ĕṁta||) biṁkamugā nābĕ nīdo bĕṭṭugām̐ bĕnam̐gĕnaṁṭā pŏṁkāna pūvubaṁtini pūm̐si vesevu aṁkĕla naṁtalo ninnu addaliṁchi sūsĕnaṁṭā saṁkĕlega vuddaṁḍāna sadurulāḍevu (||ĕṁta||) gayyāḽidanāna nābĕ kām̐giliṁchugŏnĕnaṁṭā vuyyālamaṁchamumīm̐di kŏgim̐desevu nĕyyabu śhrīveṁkaḍeśha ninniṭṭĕ sŏkkiṁchĕnaṁṭā tiyyanimovi yichchi dīgŏnevu