Title (Indic)ఆనతియ్యవయ్యా నాతో నామేలు వినే నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతియ్యవయ్యా నాతో నామేలు వినే నేను తానకమై ఇన్నిటాను తనివి నొందించెనా (॥ఆన॥) మొక్కలాన నేఁడు నీమోమునఁ గళలు నిండె చెక్కులు నొక్కెనా ఆపె సేదదేర్చెనా చిక్కనిచెమటలతో చిందువందై వున్నాఁడవు కక్కసించి మరీ నట్టె కాలుదొక్కెనా (॥ఆన॥) నవకపు సెలవులనవ్వు వెన్నెలలు గాసీ చవి చూపెనా మోవి; చాఁచెనాచేయి అవల నీ వల్లాఁ జూచి అలసేవు నీలోనే జవళిఁ గాఁగిటిలోనే సాముసేయించెనా (॥ఆన॥) చిత్తగించి నన్నుఁ జూచి సిగ్గులుపడే విదె పొత్తు గుడిపించెనా భోగించెనా యిత్తల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి హత్తించెనా పొందు అట్టె యిందు వచ్చెనా English(||pallavi||) ānadiyyavayyā nādo nāmelu vine nenu tānagamai inniḍānu tanivi nŏṁdiṁchĕnā (||āna||) mŏkkalāna nem̐ḍu nīmomunam̐ gaḽalu niṁḍĕ sĕkkulu nŏkkĕnā ābĕ sedadersĕnā sikkanisĕmaḍalado siṁduvaṁdai vunnām̐ḍavu kakkasiṁchi marī naṭṭĕ kāludŏkkĕnā (||āna||) navagabu sĕlavulanavvu vĕnnĕlalu gāsī savi sūbĕnā movi; sām̐sĕnāseyi avala nī vallām̐ jūsi alasevu nīlone javaḽim̐ gām̐giḍilone sāmuseyiṁchĕnā (||āna||) sittagiṁchi nannum̐ jūsi siggulubaḍe vidĕ pŏttu guḍibiṁchĕnā bhogiṁchĕnā yittala śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi hattiṁchĕnā pŏṁdu aṭṭĕ yiṁdu vachchĕnā