Title (Indic)పచ్చిదేరె నీ పనులు భామల ముందరనెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పచ్చిదేరె నీ పనులు భామల ముందరనెల్లా కచ్చుపెట్టి ఇంక నీకుఁ గాదన నేమున్నది (॥పచ్చి॥) వావులు చెప్పుకొంటాను వద్ద నాపె వుండఁగాను నీ విందరిలోఁ దారుకాణించుకోవద్దా భావించక నీ వెక్కడో పరాకున నుండితేను ఆవిధము నీకు సమ్మతైనట్టేకాదా (॥పచ్చి॥) గుఱుతులు చూపియాపె కొలువులు సేయఁగాను పిఱితీసి నీవు తప్పించుకోవద్దా తఱితో నిప్పుడు మొకదాకిరితో నుండితేను యెఱిఁగెఱిఁ గిదియెల్లా నియ్యకొంటేకాదా (॥పచ్చి॥) సరసములాడి యాపె చన్నుల నొత్తఁగాను వరుసతోఁ జేతనంటి వారించవద్దా ఇరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె గరిమ నూరకుండితే కైకొంటేకాదా English(||pallavi||) pachchiderĕ nī panulu bhāmala muṁdaranĕllā kachchubĕṭṭi iṁka nīgum̐ gādana nemunnadi (||pachchi||) vāvulu sĕppugŏṁṭānu vadda nābĕ vuṁḍam̐gānu nī viṁdarilom̐ dārugāṇiṁchugovaddā bhāviṁchaga nī vĕkkaḍo parāguna nuṁḍidenu āvidhamu nīgu sammadainaṭṭegādā (||pachchi||) guṟudulu sūbiyābĕ kŏluvulu seyam̐gānu piṟidīsi nīvu tappiṁchugovaddā taṟido nippuḍu mŏgadāgirido nuṁḍidenu yĕṟim̐gĕṟim̐ gidiyĕllā niyyagŏṁṭegādā (||pachchi||) sarasamulāḍi yābĕ sannula nŏttam̐gānu varusadom̐ jedanaṁṭi vāriṁchavaddā iravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ garima nūraguṁḍide kaigŏṁṭegādā