Title (Indic)మాకు నిట్టె తోఁచీ నీమర్మము నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) మాకు నిట్టె తోఁచీ నీమర్మము నేఁడు కాకు సేయరా దీసుద్ది గలిగినట్టున్నది (॥మాకు॥) చెప్పుదునా వోయి నీచిత్తములోపలి మాఁట కప్పి సిగ్గులువడవుగదా నీవు చొప్పులెత్తి నీమొగము చూచితేనే కానవచ్చు ముప్పిరి నాపెకు నీవు మోహించినట్టున్నది (॥మాకు॥) వుపమింతునా వోయి వొడలినీవుద్యేగాలు కపటముతో నవ్వవుగదా నీవు నెపములే కందు నీవు నలిచితేనే తెలుసు యిపుడే నీ కాపెకుఁ బొందెనసినట్టున్నది (॥మాకు॥) యేరుపరతునా వోయి ఇరవైననీగుణాలు గారవముతో మెచ్చవుగదా నీవు యీరీతి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను చేరి నన్నేలితి వాకెఁ జేకొనినట్లున్నది English(||pallavi||) māgu niṭṭĕ tom̐sī nīmarmamu nem̐ḍu kāgu seyarā dīsuddi galiginaṭṭunnadi (||māgu||) sĕppudunā voyi nīsittamulobali mām̐ṭa kappi sigguluvaḍavugadā nīvu sŏppulĕtti nīmŏgamu sūsidene kānavachchu muppiri nābĕgu nīvu mohiṁchinaṭṭunnadi (||māgu||) vubamiṁtunā voyi vŏḍalinīvudyegālu kabaḍamudo navvavugadā nīvu nĕbamule kaṁdu nīvu nalisidene tĕlusu yibuḍe nī kābĕgum̐ bŏṁdĕnasinaṭṭunnadi (||māgu||) yerubaradunā voyi iravainanīguṇālu gāravamudo mĕchchavugadā nīvu yīrīdi śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu seri nannelidi vāgĕm̐ jegŏninaṭlunnadi