Title (Indic)చూతువు రావమ్మా నీ సుతుని యశోదమ్మ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చూతువు రావమ్మా నీ సుతుని యశోదమ్మ బూతులఁ దిట్టీ వద్దంటే పొలఁతుల నెల్లను (॥చూతు॥) పొడవాటివుట్లెక్కి బుడుగులతోడివన్నె తొడికిపెట్టీఁ దనతోడివారికి కడవలపాలమీగడలు దేవుకతిని కడకుం బాలెల్లాఁ గార కంతలుసేసీని (॥చూతు॥) అక్కజపురోళ్లెకిక అట్టుగపై దాఁచిన- చక్కిలాలు నురుఁగులుఁ జవిగొనీని వెక్కసానఁ బట్టరాక వీదులం బారాడుతాను మొక్కలాన నెత్తుకొంటే ముద్దులువెట్టీని (॥చూతు॥) పన్నారుదొంతు లెక్కి బానలపెరుగు నేయి చెన్నుమీర నారగించి చేరి నవ్వీని అన్నిటా శ్రీవేంకటేశుఁ డలమేల్ మంగవిభుండు వన్నెలఁ గ్రిష్ణుఁ డింటింటివాకిటఁ బొంచీని English(||pallavi||) sūduvu rāvammā nī suduni yaśhodamma būdulam̐ diṭṭī vaddaṁṭe pŏlam̐tula nĕllanu (||sūdu||) pŏḍavāḍivuṭlĕkki buḍuguladoḍivannĕ tŏḍigibĕṭṭīm̐ danadoḍivārigi kaḍavalabālamīgaḍalu devugadini kaḍaguṁ bālĕllām̐ gāra kaṁtalusesīni (||sūdu||) akkajaburoḽlĕgiga aṭṭugabai dām̐sina- sakkilālu nurum̐gulum̐ javigŏnīni vĕkkasānam̐ baṭṭarāga vīdulaṁ bārāḍudānu mŏkkalāna nĕttugŏṁṭe mudduluvĕṭṭīni (||sūdu||) pannārudŏṁtu lĕkki bānalabĕrugu neyi sĕnnumīra nāragiṁchi seri navvīni anniḍā śhrīveṁkaḍeśhum̐ ḍalamel maṁgavibhuṁḍu vannĕlam̐ griṣhṇum̐ ḍiṁṭiṁṭivāgiḍam̐ bŏṁchīni