Title (Indic)ఏఁగివచ్చుఁగాని యీతఁ డింట నింట వాడ వాడ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏఁగివచ్చుఁగాని యీతఁ డింట నింట వాడ వాడ మూఁగిన యీ సింగారమోహనముతోడను (॥ఏగి॥) పెట్టినకస్తూరిబొట్టు బేంట్లెగయకుండ కట్టినహారము లెందుఁ గదలకుండ నిట్టతురుమువిరులు నవ్వటిల్లి రాలకుండ- నిట్టె అందలముపై నెక్కించరే (॥ఏగి॥) మొగిఁ జెంగావిరెంటెము నెరి విరుగకుండ చిగురుమోవిగచ్చు చెదరకుండ అగలు గందపుఁబూఁత అందునిందు నంటకుండ యెగనెత్తి అందల మెక్కించరే (॥ఏగి॥) కూడినకూటములగుఱుతులు మాయకుండ వీడెపుమదము చొక్కు విడువకుండ వేడుకకాఁడైన శ్రీవేంకటేశు నండ నన్ను యీడుదోడై యందలాన నెక్కించరె English(||pallavi||) em̐givachchum̐gāni yīdam̐ ḍiṁṭa niṁṭa vāḍa vāḍa mūm̐gina yī siṁgāramohanamudoḍanu (||egi||) pĕṭṭinagastūribŏṭṭu beṁṭlĕgayaguṁḍa kaṭṭinahāramu lĕṁdum̐ gadalaguṁḍa niṭṭadurumuvirulu navvaḍilli rālaguṁḍa- niṭṭĕ aṁdalamubai nĕkkiṁchare (||egi||) mŏgim̐ jĕṁgāvirĕṁṭĕmu nĕri virugaguṁḍa sigurumovigachchu sĕdaraguṁḍa agalu gaṁdabum̐būm̐ta aṁduniṁdu naṁṭaguṁḍa yĕganĕtti aṁdala mĕkkiṁchare (||egi||) kūḍinagūḍamulaguṟudulu māyaguṁḍa vīḍĕbumadamu sŏkku viḍuvaguṁḍa veḍugagām̐ḍaina śhrīveṁkaḍeśhu naṁḍa nannu yīḍudoḍai yaṁdalāna nĕkkiṁcharĕ