Title (Indic)బాపు బాపు మాతోనే పంతమేలోయి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) బాపు బాపు మాతోనే పంతమేలోయి చేపట్టితి వింతలోనే చెల్లునోయి (॥బాపు॥) నల్లఁబల్లిచెన్నుఁడా నవ్వేవు సారెసారె ఇల్లిదె చూతువు గాని యిందు రావోయి గొల్లదోమటాయ నేఁడు కోరి నీతో సరసాలు చల్ల వేండిసేసుకొంటే చాలులేవోయి (॥బాపు॥) గోపికలవిటుఁడా కొంగువట్టే వేమోయి యీపారి చూతువుగాని ఇందురావోఇ మూపులు మూఁడాయ నీమొక్కినమొక్కులకెల్ల రాపైన వుప్పుగప్పురములాయనోయి (॥బాపు॥) నగు శ్రీవేంకటగిరి నల్లఁబల్లి చెన్నుఁడా యెగసక్కె మిఁకనేల ఇందు రావోఇ తగుఁదగు నీకు నాకు తనిసితి నిఁక నోయి చిగురుఁజేవనుకొంటి చిత్తగించవోయి English(||pallavi||) bābu bābu mādone paṁtameloyi sebaṭṭidi viṁtalone sĕllunoyi (||bābu||) nallam̐ballisĕnnum̐ḍā navvevu sārĕsārĕ illidĕ sūduvu gāni yiṁdu rāvoyi gŏlladomaḍāya nem̐ḍu kori nīdo sarasālu salla veṁḍisesugŏṁṭe sālulevoyi (||bābu||) gobigalaviḍum̐ḍā kŏṁguvaṭṭe vemoyi yībāri sūduvugāni iṁdurāvoi mūbulu mūm̐ḍāya nīmŏkkinamŏkkulagĕlla rābaina vuppugappuramulāyanoyi (||bābu||) nagu śhrīveṁkaḍagiri nallam̐balli sĕnnum̐ḍā yĕgasakkĕ mim̐kanela iṁdu rāvoi tagum̐dagu nīgu nāgu tanisidi nim̐ka noyi sigurum̐jevanugŏṁṭi sittagiṁchavoyi