Title (Indic)ఆకెకును నీకుఁ బాయని చుట్టరికముగన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకెకును నీకుఁ బాయని చుట్టరికముగన చేకొందు విప్పుడే విచ్చేయవయ్యా (॥ఆకె॥) ధరఁ గొలని తామరలు తమనుఁ డుదయంబైన విరివిఁ జెఁగలించి వికసించును తెరవముఖకమలమైతే నీవు రాకుంటే వెరవార నాయకుఁడ వికసించదు (॥ఆకె॥) సంతతముఁ గలువ లివి చందురుని రాకలకు వింతగాఁ బై పై నే వికసించును యింతియీకనుఁగన లివియైతే నీవదన కాంతిచంద్రుఁడు రాక కడువిరియవు (॥ఆకె॥) మినుకు మయూరములు మేఘోదయంబైన తనయిచ్చ వేడుకల తగనాడును యెనలేని శ్రీవేంకటేశ యిటువలె నేఁడు వనితఁ గూడకయున్న వహికెక్కడు English(||pallavi||) āgĕgunu nīgum̐ bāyani suṭṭarigamugana segŏṁdu vippuḍe vichcheyavayyā (||āgĕ||) dharam̐ gŏlani tāmaralu tamanum̐ ḍudayaṁbaina virivim̐ jĕm̐galiṁchi vigasiṁchunu tĕravamukhagamalamaide nīvu rāguṁṭe vĕravāra nāyagum̐ḍa vigasiṁchadu (||āgĕ||) saṁtadamum̐ galuva livi saṁduruni rāgalagu viṁtagām̐ bai pai ne vigasiṁchunu yiṁtiyīganum̐gana liviyaide nīvadana kāṁtisaṁdrum̐ḍu rāga kaḍuviriyavu (||āgĕ||) minugu mayūramulu meghodayaṁbaina tanayichcha veḍugala taganāḍunu yĕnaleni śhrīveṁkaḍeśha yiḍuvalĕ nem̐ḍu vanidam̐ gūḍagayunna vahigĕkkaḍu