Title (Indic)ఈ మేలు దలఁచుకో యెప్పుడును నీమతిలో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఈ మేలు దలఁచుకో యెప్పుడును నీమతిలో సాములు సేసి నీతో చలము నెరపదా (॥ఈమే॥) కొంతగొంత నాచెక్కు గోర నీవు గీరితేను పంతములాడితినా పదరితినా రంతుల వేరొకతైతే రవ్వనేసి నీమేను యెంతైనా నొకటికి యినుమడిసేయదా (॥ఈమే॥) పలుమారు నామోవిపై పలుసోఁకులు నించితే బలిమిసేసితినా పదరితినా వెలయ వేరొకతైతే వింతలుగా విన్నప్పటి యెలయించి వొకటికి యినుమడి సేయదా (॥ఈమే॥) చందపుశ్రీవేంకటేశ చన్నులొత్తి కూడితివి పందెములు గొంటినా పదరితినా విందులవేరొకతైతే వేసాలెల్లాఁ జూపి యిందరిలో వొకటికి యినుమడిసేయదా English(||pallavi||) ī melu dalam̐sugo yĕppuḍunu nīmadilo sāmulu sesi nīdo salamu nĕrabadā (||īme||) kŏṁtagŏṁta nāsĕkku gora nīvu gīridenu paṁtamulāḍidinā padaridinā raṁtula verŏgadaide ravvanesi nīmenu yĕṁtainā nŏgaḍigi yinumaḍiseyadā (||īme||) palumāru nāmovibai palusom̐kulu niṁchide balimisesidinā padaridinā vĕlaya verŏgadaide viṁtalugā vinnappaḍi yĕlayiṁchi vŏgaḍigi yinumaḍi seyadā (||īme||) saṁdabuśhrīveṁkaḍeśha sannulŏtti kūḍidivi paṁdĕmulu gŏṁṭinā padaridinā viṁdulaverŏgadaide vesālĕllām̐ jūbi yiṁdarilo vŏgaḍigi yinumaḍiseyadā