Title (Indic)నాటకాలు బూటకాలు నాతోనే వలెనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నాటకాలు బూటకాలు నాతోనే వలెనా నీటుతోడ నీ సుద్దులు నే నెఱఁగనా (॥నాట॥) తళుకున నాపెఁజూచి తలవంచుకొంటివిని వలన నాసపడనవానివలెనె తలఁపులో నారూపు తలపోసి తలపోసి నెలకొని కరఁగేది నే నెఱఁగనా (॥నాట॥) ఆకెమాట చెవుల విననట్టె మారుమాటాడవు నాకు నా కొప్పగించినవానివలెనె చేకొని యీపరాకున సిగ్గులమాట లూహించి నీకునీకె సుకించేది నే నెఱఁగనా (॥నాట॥) నీమీఁద నాపె చేచాఁచ నీవు నాపైఁ జేచాఁచేవు వాములుగా నన్నుఁ గూడేవానివలెనే యీమై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె నీమన సాడ నుండుట నే నెఱఁగనా English(||pallavi||) nāḍagālu būḍagālu nādone valĕnā nīḍudoḍa nī suddulu ne nĕṟam̐ganā (||nāḍa||) taḽuguna nābĕm̐jūsi talavaṁchugŏṁṭivini valana nāsabaḍanavānivalĕnĕ talam̐pulo nārūbu talabosi talabosi nĕlagŏni karam̐gedi ne nĕṟam̐ganā (||nāḍa||) āgĕmāḍa sĕvula vinanaṭṭĕ mārumāḍāḍavu nāgu nā kŏppagiṁchinavānivalĕnĕ segŏni yībarāguna siggulamāḍa lūhiṁchi nīgunīgĕ sugiṁchedi ne nĕṟam̐ganā (||nāḍa||) nīmīm̐da nābĕ sesām̐sa nīvu nābaim̐ jesām̐sevu vāmulugā nannum̐ gūḍevānivalĕne yīmai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ nīmana sāḍa nuṁḍuḍa ne nĕṟam̐ganā