You are here

Iddarigim jellu niduvamtiprema

Title (Indic)
ఇద్దరికిఁ జెల్లు నిటువంటిప్రేమ
Work
Language
Credits
Role Artist
Writer Annamacharya

Lyrics

Telugu

(॥పల్లవి॥)
ఇద్దరికిఁ జెల్లు నిటువంటిప్రేమ
ముద్దుఁ దుమ్మిదలు మెరసినట్టాయ

(॥ఇద్ద॥)
తళుకుఁజూపులు తరుణి చూచితే
నెలవుల నవ్వేవు చెలువుఁడ
వొలిసి చంద్రుఁడు వుదయించితేను
కలువలు చెలఁగేగతులాయను

(॥ఇద్ద॥)
కాంత నిమ్మపండు కానుకిచ్చితే పూ
బంతిఁగొని యాపెపై వేసితి
కంతునివసంతకాలము వచ్చితే
పొంత వనమెల్లఁ బూచినట్టాయ

(॥ఇద్ద॥)
మోవిచూపి యాపె మొక్కు మొక్కి తేను
శ్రీవేంకటేశ్వర చేకొంటివి
వావిరి భూమిపై వానగురిసితే
భావించి పంటలు పండినట్టాయ

English

(||pallavi||)
iddarigim̐ jĕllu niḍuvaṁṭiprema
muddum̐ dummidalu mĕrasinaṭṭāya

(||idda||)
taḽugum̐jūbulu taruṇi sūside
nĕlavula navvevu sĕluvum̐ḍa
vŏlisi saṁdrum̐ḍu vudayiṁchidenu
kaluvalu sĕlam̐gegadulāyanu

(||idda||)
kāṁta nimmabaṁḍu kānugichchide pū
baṁtim̐gŏni yābĕbai vesidi
kaṁtunivasaṁtagālamu vachchide
pŏṁta vanamĕllam̐ būsinaṭṭāya

(||idda||)
movisūbi yābĕ mŏkku mŏkki tenu
śhrīveṁkaḍeśhvara segŏṁṭivi
vāviri bhūmibai vānaguriside
bhāviṁchi paṁṭalu paṁḍinaṭṭāya

Lyrics search