Title (Indic)పతితోడి చలములు పడతులకేఁటికే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పతితోడి చలములు పడతులకేఁటికే యితవు దెలుసుకోవే యీడేరుఁ బనులు (॥పతి॥) పెంచిపెంచి వెంగేలు పెక్కుమారు లాడుకుంటే మంచిమాఁ టొకటాడితే మతి గరఁగు పంచనుండి బీరముతో బడలుటకంటెను ఇంచుక మొక్కు మొక్కితే నీడేరుఁ బనులు (॥పతి॥) వొట్టులు వెట్టుక లోలో నూసురసురనుకంటే చుట్టరిక మేపాటైనా సుకము దక్కు వెట్టరియైనవిరహన వేగినంతా వేగుకంటే యెట్టైనాఁ బంతమిచ్చితే నీడేరుఁ బనులు (॥పతి॥) తలవంచుక సిగ్గులు తవ్వుకొంటా నుండుకంటే మొలకనవ్వు నవ్వితే మొగమోటలౌ యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁగూడె ఇల నీనేరుపులనే యీడేరుఁ బనులు English(||pallavi||) padidoḍi salamulu paḍadulagem̐ṭige yidavu dĕlusugove yīḍerum̐ banulu (||padi||) pĕṁchibĕṁchi vĕṁgelu pĕkkumāru lāḍuguṁṭe maṁchimām̐ ṭŏgaḍāḍide madi garam̐gu paṁchanuṁḍi bīramudo baḍaluḍagaṁṭĕnu iṁchuga mŏkku mŏkkide nīḍerum̐ banulu (||padi||) vŏṭṭulu vĕṭṭuga lolo nūsurasuranugaṁṭe suṭṭariga mebāḍainā sugamu dakku vĕṭṭariyainavirahana veginaṁtā vegugaṁṭe yĕṭṭainām̐ baṁtamichchide nīḍerum̐ banulu (||padi||) talavaṁchuga siggulu tavvugŏṁṭā nuṁḍugaṁṭe mŏlaganavvu navvide mŏgamoḍalau yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐gūḍĕ ila nīnerubulane yīḍerum̐ banulu