Title (Indic)ఆనతీవయ్యా నీ మోహపు దేవుల సుద్దులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతీవయ్యా నీ మోహపు దేవుల సుద్దులు వీనులార వినేము వేడుకయ్యీ మాకు (॥ఆన॥) సొలసిసొలసి యాపె సుద్దులు చెప్పుతానుండె యెలమితో నిందాఁకా నేఁటికోకాని మొలకనవ్వులతోడ మోము చూపుతానుండె పలుమారు నది యెంతపనికోకాని (॥ఆన॥) చెంతఁ జెక్కుచేతితోడ సిగ్గువడుతానుండె పంతమున నది యేమిభావమోకాని సంతోసాన మెచ్చిమెచ్చి సరసమాడుతానుండె వింతలేక నీతో నెంతవేడుకోకాని (॥ఆన॥) కమ్మరఁగమ్మర నిన్నుఁ గాఁగిలించుకొంటానుండె చిమ్మినేఁటిరహస్యపుచేఁతలో కాని పమ్మియలమేలుమంగపతివి శ్రీవేంకటేశ కమ్ముక నన్నేలితి వాకతలేవోకాని English(||pallavi||) ānadīvayyā nī mohabu devula suddulu vīnulāra vinemu veḍugayyī māgu (||āna||) sŏlasisŏlasi yābĕ suddulu sĕppudānuṁḍĕ yĕlamido niṁdām̐kā nem̐ṭigogāni mŏlaganavvuladoḍa momu sūbudānuṁḍĕ palumāru nadi yĕṁtabanigogāni (||āna||) sĕṁtam̐ jĕkkusedidoḍa sigguvaḍudānuṁḍĕ paṁtamuna nadi yemibhāvamogāni saṁtosāna mĕchchimĕchchi sarasamāḍudānuṁḍĕ viṁtalega nīdo nĕṁtaveḍugogāni (||āna||) kammaram̐gammara ninnum̐ gām̐giliṁchugŏṁṭānuṁḍĕ simminem̐ṭirahasyabusem̐talo kāni pammiyalamelumaṁgabadivi śhrīveṁkaḍeśha kammuga nannelidi vāgadalevogāni