Title (Indic)ఆకెనేల వొట్టువెట్టే వది దెలుపమంటాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకెనేల వొట్టువెట్టే వది దెలుపమంటాను పైకొని నీలో నీవే భావించుకోరాదా (॥ఆకె॥) నగితే నీదేవుల నానలువెట్టేలడిగేవు జిగిమించ మరి యేమి చెప్పమనేవు మగఁడవు నీచేఁతలు మరేమైనాఁ గలితే తగిలి నీలో నీవే తలఁచుకొరాదా (॥ఆకె॥) నీమోము చూచితేనేల నెలఁత కొంగు వట్టేవు నేమాన నేమి దారుకాణించుమనేవు యేమైనా నీసుద్దులు యేకడనైనాఁ గలితే దీమసాన నీలో నీవే తెలుసుకోరాదా (॥ఆకె॥) అలమేలుమంగ నిన్ను నంటితే నేల కొంకేవు యెలమి శ్రీవేంకటేశ యెంతొరసేవు యిలఁ గూడితివి యింక నేపనులైనాఁ గలితే వెలయ నీలో నీవే విచారించుకొరాదా English(||pallavi||) āgĕnela vŏṭṭuvĕṭṭe vadi dĕlubamaṁṭānu paigŏni nīlo nīve bhāviṁchugorādā (||āgĕ||) nagide nīdevula nānaluvĕṭṭelaḍigevu jigimiṁcha mari yemi sĕppamanevu magam̐ḍavu nīsem̐talu maremainām̐ galide tagili nīlo nīve talam̐sugŏrādā (||āgĕ||) nīmomu sūsidenela nĕlam̐ta kŏṁgu vaṭṭevu nemāna nemi dārugāṇiṁchumanevu yemainā nīsuddulu yegaḍanainām̐ galide dīmasāna nīlo nīve tĕlusugorādā (||āgĕ||) alamelumaṁga ninnu naṁṭide nela kŏṁkevu yĕlami śhrīveṁkaḍeśha yĕṁtŏrasevu yilam̐ gūḍidivi yiṁka nebanulainām̐ galide vĕlaya nīlo nīve visāriṁchugŏrādā