Title (Indic)ఆతఁ డేమి చెప్పినాను అట్టే సేతువుగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁ డేమి చెప్పినాను అట్టే సేతువుగాని చేతికి విడెమియ్యఁగా సిగ్గులు వడకువే (॥అత॥) యెనసివుండినవారి కిచ్చకములే పోడము ననుపుగలుగుచోట నాటుఁ బ్రేమము పెనఁగఁగ బెనఁగఁగా ప్రియములు పెచ్చురేఁగు చెనకితే విభునితో సిగ్గులువడకువే (॥అత॥) మంతనాన నుండఁగాను మనసుసు గరఁగును వింత సేయకుండితేనే వేడుక నిండు సంతసించి మాటాడితే చవులు దానే పుట్టు చెంత నాతఁడేమనినా సిగ్గులువడకువే (॥అత॥) తలఁపులు సరియైతేఁ దమకము లుప్పతిల్లు కలయిక లబ్బితేను కైవశమౌను అలమె శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవు నీవు చెలికత్తేల ముందర సిగ్గులువడకువే English(||pallavi||) ādam̐ ḍemi sĕppinānu aṭṭe seduvugāni sedigi viḍĕmiyyam̐gā siggulu vaḍaguve (||ada||) yĕnasivuṁḍinavāri kichchagamule poḍamu nanubugalugusoḍa nāḍum̐ bremamu pĕnam̐gam̐ga bĕnam̐gam̐gā priyamulu pĕchchurem̐gu sĕnagide vibhunido sigguluvaḍaguve (||ada||) maṁtanāna nuṁḍam̐gānu manasusu garam̐gunu viṁta seyaguṁḍidene veḍuga niṁḍu saṁtasiṁchi māḍāḍide savulu dāne puṭṭu sĕṁta nādam̐ḍemaninā sigguluvaḍaguve (||ada||) talam̐pulu sariyaidem̐ damagamu luppadillu kalayiga labbidenu kaivaśhamaunu alamĕ śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu sĕligattela muṁdara sigguluvaḍaguve