Title (Indic)ఇపుడేల సిగ్గువడే విందరిలోన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇపుడేల సిగ్గువడే విందరిలోన వుప్పతిల నాపె రతి నోలలాడవా (॥ఇపు॥) గుత్త పుగుబ్బలతాఁకులకు నొడ్డించుకొంటా హత్తి యాపెతో సరసమాడవా నీవు జోత్తుగా మోవియుమోవి సోఁకఁగా నోరుదెఱచి బత్తితోడఁ దమ్ములము పడఁతి కొసఁగవా (॥ఇపు॥) వడియుబెంజెమటలవానలఁ దడుసుకొంటా కడుఁగడుఁ బెనఁగవా చాఁచి కాంతతోడను తోడపైఁ బాదాలు చాఁచి తోరలింపునవ్వులతో చిడుముడిచేఁతలెల్లఁ జేయవా ఆపెతోను (॥ఇపు॥) కోప్పువిరులవాసన గొలుకొంటాఁ గాఁగిలించి మెప్పించి కూడవా యలమేలుమంగను ముప్పిరి శ్రీవేంటేశ మోహించి యాపె నురాన యెప్పుడుఁ బెట్టుకుండవా యేలితివి నన్నును English(||pallavi||) ibuḍela sigguvaḍe viṁdarilona vuppadila nābĕ radi nolalāḍavā (||ibu||) gutta pugubbaladām̐kulagu nŏḍḍiṁchugŏṁṭā hatti yābĕdo sarasamāḍavā nīvu jottugā moviyumovi som̐kam̐gā norudĕṟasi battidoḍam̐ dammulamu paḍam̐ti kŏsam̐gavā (||ibu||) vaḍiyubĕṁjĕmaḍalavānalam̐ daḍusugŏṁṭā kaḍum̐gaḍum̐ bĕnam̐gavā sām̐si kāṁtadoḍanu toḍabaim̐ bādālu sām̐si toraliṁpunavvulado siḍumuḍisem̐talĕllam̐ jeyavā ābĕdonu (||ibu||) koppuvirulavāsana gŏlugŏṁṭām̐ gām̐giliṁchi mĕppiṁchi kūḍavā yalamelumaṁganu muppiri śhrīveṁṭeśha mohiṁchi yābĕ nurāna yĕppuḍum̐ bĕṭṭuguṁḍavā yelidivi nannunu