Title (Indic)నీమన నెఱుఁగుదుము నెలఁతపై దయ గద్దు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీమన నెఱుఁగుదుము నెలఁతపై దయ గద్దు కామించి ఇంటికివచ్చి కనుసన్నలేఁటికి (॥నీమ॥) మక్కువ సేసినవారి మన్నించనేవలెఁగాక పెక్కులాగులను జోలిఁ బెట్టనేఁటికి చక్కెరమోవి యిచ్చితే చవిగోనవలెఁగాక తక్కులఁబెట్టేటివట్టితరితీపు లేఁటికి (॥నీమ॥) చుట్టాలయినవారిఁ జూచి చోటీవలెఁగాక అట్టె రట్టుసేసేటియాఱడేఁటికి గట్టిచన్నుల నోత్తితే కరఁగఁగవలెఁగాక గుట్టున గుబ్బతి లించేగొరబు లింతేఁటికి (॥నీమ॥) లలి నాసపడ్డవారి లాలించవలెఁగాక నెలవినవ్వుల జాగు సేయనేఁటికి అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర కలసితివి చెలివి కత లిఁకనేఁటికి English(||pallavi||) nīmana nĕṟum̐gudumu nĕlam̐tabai daya gaddu kāmiṁchi iṁṭigivachchi kanusannalem̐ṭigi (||nīma||) makkuva sesinavāri manniṁchanevalĕm̐gāga pĕkkulāgulanu jolim̐ bĕṭṭanem̐ṭigi sakkĕramovi yichchide savigonavalĕm̐gāga takkulam̐bĕṭṭeḍivaṭṭidaridību lem̐ṭigi (||nīma||) suṭṭālayinavārim̐ jūsi soḍīvalĕm̐gāga aṭṭĕ raṭṭuseseḍiyāṟaḍem̐ṭigi gaṭṭisannula nottide karam̐gam̐gavalĕm̐gāga guṭṭuna gubbadi liṁchegŏrabu liṁtem̐ṭigi (||nīma||) lali nāsabaḍḍavāri lāliṁchavalĕm̐gāga nĕlavinavvula jāgu seyanem̐ṭigi alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara kalasidivi sĕlivi kada lim̐kanem̐ṭigi