Title (Indic)ఆతనికి నీకు నింపులై యుండఁగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనికి నీకు నింపులై యుండఁగా యీతలాతలివారి కెంచఁగనేమిటికి (॥ఆత॥) మగఁడుమన్నించేదానిమాటలెల్లాఁ జక్కనే తగవరివనితపంతము చక్కన నగనేరిచినదానినటనలెల్లా జక్కన యెగసకెములాడఁగ యెవ్వరికేమిటికి (॥ఆత॥) సిరిగలిగినదానిచేఁతలెల్లాఁ జక్కనే పొరుగుపోరచికాంతపొందు చక్కన సరినిచ్చకపుదానిసరసములు చక్కన దొరకొని యెవ్వరికి దూరఁగనేమిటికే (॥ఆత॥) పాయము గలుగు దాని పగటులెల్లాఁ జక్కనే చాయయెఱిఁగినసతిజాడ చక్కన యీయెడ శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను పాయక నన్నేలె తాము పచ్చార నేమిటికే English(||pallavi||) ādanigi nīgu niṁpulai yuṁḍam̐gā yīdalādalivāri kĕṁcham̐ganemiḍigi (||āda||) magam̐ḍumanniṁchedānimāḍalĕllām̐ jakkane tagavarivanidabaṁtamu sakkana naganerisinadāninaḍanalĕllā jakkana yĕgasagĕmulāḍam̐ga yĕvvarigemiḍigi (||āda||) sirigaliginadānisem̐talĕllām̐ jakkane pŏruguborasigāṁtabŏṁdu sakkana sarinichchagabudānisarasamulu sakkana dŏragŏni yĕvvarigi dūram̐ganemiḍige (||āda||) pāyamu galugu dāni pagaḍulĕllām̐ jakkane sāyayĕṟim̐ginasadijāḍa sakkana yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu pāyaga nannelĕ tāmu pachchāra nemiḍige