Title (Indic)ఆనతియ్యఁగదవయ్య ఆకడనీకడ నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతియ్యఁగదవయ్య ఆకడనీకడ నీకు తానకపుఁగానుకలు దక్కెనో దక్కదో (॥ఆన॥) మోవితేనెబోనాలు మోసునవ్వుమోనాలు ఆవలఁ జెలి యొకతె అంపె నీకదే కావికంటికుంకుమలు కమ్మవూర్పుసురటులు యీవలనీ కంపితిని యెక్కెనో యెక్కదో (॥ఆన॥) చేసన్నవీడేలు చిమ్ముగోరి మేడేలు పోసరించి వేరొకతె పుత్తెంచె నీకు యీసుఁజెమటపన్నీరు యింపుగాఁకలరతులు వాసికి నే నంపితిని వచ్చెనో రాదో (॥ఆన॥) పలుకులకప్పురాలు భావరతిచప్పరాలు యెలమి శ్రీవేంకటేశ యిచ్చె నెవ్వతో బలుసరసపు మొక్కుపాన్పుపై కూటమిచొక్కు తలఁగక నీ కిచ్చితి తని సెనో తనియదో English(||pallavi||) ānadiyyam̐gadavayya āgaḍanīgaḍa nīgu tānagabum̐gānugalu dakkĕno dakkado (||āna||) movidenĕbonālu mosunavvumonālu āvalam̐ jĕli yŏgadĕ aṁpĕ nīgade kāvigaṁṭiguṁkumalu kammavūrbusuraḍulu yīvalanī kaṁpidini yĕkkĕno yĕkkado (||āna||) sesannavīḍelu simmugori meḍelu posariṁchi verŏgadĕ puttĕṁchĕ nīgu yīsum̐jĕmaḍabannīru yiṁpugām̐kalaradulu vāsigi ne naṁpidini vachchĕno rādo (||āna||) palugulagappurālu bhāvaradisapparālu yĕlami śhrīveṁkaḍeśha yichchĕ nĕvvado balusarasabu mŏkkubānpubai kūḍamisŏkku talam̐gaga nī kichchidi tani sĕno taniyado