Title (Indic)నీవు నాకు దాఁచనేల నిజసుద్ది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నీవు నాకు దాఁచనేల నిజసుద్ది చేవదేర వేదములో చెప్పేటి సుద్ది (॥నీవు॥) నిండెను లోకములోన నీవు గోపికలనెల్లా అండనే బలిమిసేతువన్న సుద్ది మెండాయ నదివొ నీమేనమామఁ జంపి దండిమధుర సతులఁ దగిలిన సుద్ది (॥నీవు॥) వింటిమి సీతకుఁగాను వేవేలుకోఁతులఁ గూడి బంటతనమున పాటువడ్డ సుద్ది కంటిమి సిగ్గువిడిచి కడు బురసతులకై గెంటక బిత్తలేతిరిగినసుద్ది (॥నీవు॥) నెగడె వరాహమవై నీమేనిరోఁత చూడక పొగడి భూపతి నీవుపొందిన సుద్ది అగడాయ శ్రీవేంకటాధిప నీ విందిరమ తగ మెడఁగట్టుకొని దైవమైన సుద్ది English(||pallavi||) nīvu nāgu dām̐sanela nijasuddi sevadera vedamulo sĕppeḍi suddi (||nīvu||) niṁḍĕnu logamulona nīvu gobigalanĕllā aṁḍane balimiseduvanna suddi mĕṁḍāya nadivŏ nīmenamāmam̐ jaṁpi daṁḍimadhura sadulam̐ dagilina suddi (||nīvu||) viṁṭimi sīdagum̐gānu vevelugom̐tulam̐ gūḍi baṁṭadanamuna pāḍuvaḍḍa suddi kaṁṭimi sigguviḍisi kaḍu burasadulagai gĕṁṭaga bittalediriginasuddi (||nīvu||) nĕgaḍĕ varāhamavai nīmenirom̐ta sūḍaga pŏgaḍi bhūbadi nīvubŏṁdina suddi agaḍāya śhrīveṁkaḍādhiba nī viṁdirama taga mĕḍam̐gaṭṭugŏni daivamaina suddi