Title (Indic)ఆనలింకా మానవా ప్రహ్లాదవరదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనలింకా మానవా ప్రహ్లాదవరదా నానెఁ జెమటఁ జెక్కులు నవ్వులింత చాలదా (॥ఆన॥) పిప్పిచేసితివి మోవి బెదరించితివి నీవి అప్పటి నాసోదమా ప్రహ్లాదవరదా కొప్పు జారఁజేసితివి కొంగువట్టితీసితివి రెప్పలెత్తి చూచే వింకా రేసెంత గలదో (॥ఆన॥) మానముపైఁ దిట్టితివి మర్మము చేముట్టితి ఐన నింతచాలదా ప్రహ్లాదవరదా మేనెల్లఁ జొక్కించితివి మేకుల దక్కించితివి శేననవ్వులు నవ్వేవు సేఁత లింత చాలదా, (॥ఆన॥) చెక్కుఁ గడునొక్కితివి చేతులెత్తి మొక్కితివి అక్కరింకానేఁటికి ప్రహ్లాదవరదా యెక్కువ శ్రీవేంకటాద్రి నిరవైనదేవుఁడవు దక్కి నన్నుఁ గూడితివి తమి యెంతగలదో English(||pallavi||) ānaliṁkā mānavā prahlādavaradā nānĕm̐ jĕmaḍam̐ jĕkkulu navvuliṁta sāladā (||āna||) pippisesidivi movi bĕdariṁchidivi nīvi appaḍi nāsodamā prahlādavaradā kŏppu jāram̐jesidivi kŏṁguvaṭṭidīsidivi rĕppalĕtti sūse viṁkā resĕṁta galado (||āna||) mānamubaim̐ diṭṭidivi marmamu semuṭṭidi aina niṁtasāladā prahlādavaradā menĕllam̐ jŏkkiṁchidivi megula dakkiṁchidivi śhenanavvulu navvevu sem̐ta liṁta sāladā, (||āna||) sĕkkum̐ gaḍunŏkkidivi sedulĕtti mŏkkidivi akkariṁkānem̐ṭigi prahlādavaradā yĕkkuva śhrīveṁkaḍādri niravainadevum̐ḍavu dakki nannum̐ gūḍidivi tami yĕṁtagalado