Title (Indic)ఆనతియ్యవయ్యా అందుకు మాఁటెఱుఁగుదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతియ్యవయ్యా అందుకు మాఁటెఱుఁగుదు పూని అందరిని నీకుఁ బొందుసేసేను (॥ఆన॥) వసివాడు మోముతోడ వంచుకొనేవు శిరసు దెసల నెవ్వతెయైనాఁ దిట్టదుగదా అసురుసురౌతాను అలసేవు పలుమారు పిసికి ని న్నెవ్వతైనాఁ బిప్పిసేసెనో (॥ఆన॥) వుడుకుఁ జెమటతోడ నొరగేవు మలగుపై కడనెవ్వతైనా నలుగదుగదా చిడుముడితోఁ గొంత చిన్నఁబోయివున్నాఁడవు పడఁతి యెవ్వ తెయైనాఁ బంతమాడెనో (॥ఆన॥) నిండుఁగళలతోడుత నివ్వెరగైనాఁడవు అండనెవ్వతైనా మర్మా లంటదు గదా దండిగా శ్రీవేంకటేశ తగ నన్ను నేలితివి చండిపెట్టి యెవ్వతైనా సారెకు బోధించెనో English(||pallavi||) ānadiyyavayyā aṁdugu mām̐ṭĕṟum̐gudu pūni aṁdarini nīgum̐ bŏṁdusesenu (||āna||) vasivāḍu momudoḍa vaṁchugŏnevu śhirasu dĕsala nĕvvadĕyainām̐ diṭṭadugadā asurusuraudānu alasevu palumāru pisigi ni nnĕvvadainām̐ bippisesĕno (||āna||) vuḍugum̐ jĕmaḍadoḍa nŏragevu malagubai kaḍanĕvvadainā nalugadugadā siḍumuḍidom̐ gŏṁta sinnam̐boyivunnām̐ḍavu paḍam̐ti yĕvva tĕyainām̐ baṁtamāḍĕno (||āna||) niṁḍum̐gaḽaladoḍuda nivvĕragainām̐ḍavu aṁḍanĕvvadainā marmā laṁṭadu gadā daṁḍigā śhrīveṁkaḍeśha taga nannu nelidivi saṁḍibĕṭṭi yĕvvadainā sārĕgu bodhiṁchĕno