Title (Indic)నిన్నుఁ జూచుకొనవద్దా నేఁడు మమ్మేమి చెప్పేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) నిన్నుఁ జూచుకొనవద్దా నేఁడు మమ్మేమి చెప్పేవు జున్నుగా సిగ్గురేఁచితే జోరునఁ బైజారదా (॥నిన్ను॥) నిండుజాణలైనవారు నీతో నవ్వేరుగాక అండనున్న కన్నెలము అందుకోపేమా చండిపెట్టి నీవు నేడు చల్లలమ్మేవారిఁ దెచ్చి బండుబండుసేయఁబోతే పలుచనేకాదా (॥నిన్ను॥) యిచ్చకమాడేటివారు యియ్యకొనుందురుగాక అచ్చపముద్దరాండ్ల మందుకోపేమా పచ్చిదేరేమాట లాడి పల్లెతావువారిఁ దెచ్చి ముచ్చిలి చేచాఁచఁబోతే ముదుగులేకావా (॥నిన్ను॥) మందెమేళమైనవారే మారువెనఁగేరుగాక అందపు మానావతుల మందుకోపేమా చెందితి శ్రీవేంకటేశ చేఁగల మఱ్ఱిలో నన్ను మందలించఁబోతేను మతకమేకాదా English(||pallavi||) ninnum̐ jūsugŏnavaddā nem̐ḍu mammemi sĕppevu junnugā siggurem̐side jorunam̐ baijāradā (||ninnu||) niṁḍujāṇalainavāru nīdo navverugāga aṁḍanunna kannĕlamu aṁdugobemā saṁḍibĕṭṭi nīvu neḍu sallalammevārim̐ dĕchchi baṁḍubaṁḍuseyam̐bode palusanegādā (||ninnu||) yichchagamāḍeḍivāru yiyyagŏnuṁdurugāga achchabamuddarāṁḍla maṁdugobemā pachchideremāḍa lāḍi pallĕdāvuvārim̐ dĕchchi muchchili sesām̐sam̐bode mudugulegāvā (||ninnu||) maṁdĕmeḽamainavāre māruvĕnam̐gerugāga aṁdabu mānāvadula maṁdugobemā sĕṁdidi śhrīveṁkaḍeśha sem̐gala maṭrilo nannu maṁdaliṁcham̐bodenu madagamegādā