Title (Indic)ఆతఁడు నీవు నేకమై అనుభవింతువుగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు నీవు నేకమై అనుభవింతువుగాక రీతిగాని చలములు రేఁచఁగా రాదమ్మా (॥ఆత॥) మారుమాట లేమిటికి మంతనము లేమిటికి కూరిమిగలవారికి కొన్నదే కోలు నేరుపరివిభుఁడు నీవద్దికి వచ్చె బీరపునీయలుకలు పెంచఁగరాదమ్మా (॥ఆత॥) మల్లాడనేమిటికి మాటలాడనేమిటికి చెల్లుబడి గలితూ సేసినదే చేఁత కొల్లలుగా నానలు వెట్టుకొని పతి నమ్మించె పల్లదపు నీవెంగేలు పనికిరాదమ్మా (॥ఆత॥) సిగ్గువడనేమిటికి చెక్కుచేయి యేమిటికి అగ్గమై మీలోనఁ బట్టినదే పంతము వొగ్గి శ్రీవేంకటేశుఁడు వొనగూడె నిన్ను నిట్టె వెగ్గళించి నిఁకనేమి వెలితిలేదమ్మా English(||pallavi||) ādam̐ḍu nīvu negamai anubhaviṁtuvugāga rīdigāni salamulu rem̐sam̐gā rādammā (||āda||) mārumāḍa lemiḍigi maṁtanamu lemiḍigi kūrimigalavārigi kŏnnade kolu nerubarivibhum̐ḍu nīvaddigi vachchĕ bīrabunīyalugalu pĕṁcham̐garādammā (||āda||) mallāḍanemiḍigi māḍalāḍanemiḍigi sĕllubaḍi galidū sesinade sem̐ta kŏllalugā nānalu vĕṭṭugŏni padi nammiṁchĕ palladabu nīvĕṁgelu panigirādammā (||āda||) sigguvaḍanemiḍigi sĕkkuseyi yemiḍigi aggamai mīlonam̐ baṭṭinade paṁtamu vŏggi śhrīveṁkaḍeśhum̐ḍu vŏnagūḍĕ ninnu niṭṭĕ vĕggaḽiṁchi nim̐kanemi vĕlidiledammā